Tecno Spark: 7 వేలకే భారీ బ్యాటరీతో టెక్నో ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇదే..!
టెక్నో స్పార్క్ గో-2023 మోడల్ గా పరిగణిస్తున్న ఈ ఫోన్ లో ఏకంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం. అలాగే 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యుయల్ రింగ్ కెమెరా సెటప్ తో ఇది వినిగోదారులను ఆకట్టుకుంటుంది.

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో తన స్పార్క్ గో సిరీస్ ను భారత మార్కెట్ లో రిలీజ్ చేసింది. రూ. 7 వేల ధరతో బడ్జెట్ ఫోన్ సిరీస్ లో ఈ ఫోన్ నిలవనుంది. ఇందులో కెమెరా, దీర్ఘకాలం ఉండే బ్యాటరీ లైఫ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కీలక ఫీచర్లుగా ఉన్నాయి.టెక్నో స్పార్క్ గో-2023 మోడల్ గా పరిగణిస్తున్న ఈ ఫోన్ లో ఏకంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం. అలాగే 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యుయల్ రింగ్ కెమెరా సెటప్ తో ఇది వినిగోదారులను ఆకట్టుకుంటుంది. టెక్నో స్మార్ట్ గో 2023 ఫోన్ 3 జీబీ ర్యామ్ +32 జీబీ ఇంటర్నల్ మెమరీ తో వస్తుంది. దీని రూ.6999 గా కంపెనీ నిర్ణయించింది. అలాగే మెమరీని 256 జీబీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంది. నెబ్యులా పర్పుల్, ఎండ్ లెస్ బ్లాక్, ఉయుని బ్లూ వంటి రంగుల్లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చే నెల నుంచి అన్ని రిటైల్ స్టోర్స్ లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆన్ లైన్ ఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ పేర్కొనలేదు.
టెక్నో స్పార్క్ గో 2023 స్పెసిఫికేషన్లు
- హీలియో ఏ 22 ప్రాసెసర్ తో 2.0 జీహెచ్ జెడ్ సీపీయూ ద్వారా శక్తిని పొందుతుంది.
- ఆండ్రాయిడ్ 12 సపోర్ట్
- డ్యుయల్ ఫ్లాష్ లైట్స్ తో 13 ఎంపీ ప్రైమరీ కెమెరా
- మైక్రో స్లిట్ ఫ్లాష్ లైట్ తో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
- యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ వంటి సెన్సార్లు
- 32 రోజుల స్టాండ్ బై తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- అలాగే 10 వాట్స్ తో సూపర్ చార్జ్ సపోర్ట్
- బ్లూటూత్ 5.0 ద్వారా స్పీడ్ కనెక్టవిటీ
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం