Infinix Note 12i: రూ. 10 వేలకే 50 మెగాపిక్సెల్ కెమెరా.. ఇండియన్ మార్కెట్లో దుమ్మురేపుతోన్న కొత్త స్మార్ట్ ఫోన్..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్‌ఫినిక్స్ నోట్ 12ఐ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. జనవరి 25న లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది...

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్‌ఫినిక్స్ నోట్ 12ఐ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. జనవరి 25న లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ. 9,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌తో జియో రూ. 1000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఇక స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 33 వాట్స్‌కి సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, DTS ఆడియో సపోర్ట్ ఈ ఫోన్ సొంతం.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..