Sundar Pichai: ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన గూగుల్ సీఈఓ.. లేఆఫ్స్‌కి అసలు కారణం ఏంటంటే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఉద్యోగుల తొలగింపు వార్తలే.. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న తరుణంలో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఉద్యోగుల తొలగింపు వార్తలే.. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న తరుణంలో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ ఏంగా 12,000 బంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. నైపుణ్యమున్న ఉద్యోగులను కూడా తొలగించాల్సి వచ్చిందని, దీనిపై క్షమాపణలు చెబుతున్నాను అంటూ సుందరి పిచాయ్ గత శుక్రవారం వెల్లడించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఉద్యోగుల తొలగింపుపై సుందర్ పిచాయ్ మరోసారి స్పందించారు. సోమవారం ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో సుందర్ పిచాయ్ పలు విషయాలను పంచుకున్నారు. సంస్థ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఒకవేళ ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారి ఉండేదని సుందర్ తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఇది కేవలం ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియతో ఆగిపోదని, బోనస్‌లపై కూడా ప్రభావం పడుతుందని పిచాయ్ తెలిపారు.
నాయకత్వ హోదాల్లో ఉన్న అందరికీ ఈ ఏడాది బోనస్‌లు తగ్గుతాయని సుందర్ పిచాయ్ తెలిపినట్లు సమాచారం. ఇక ఎక్కువ కాలం నుంచి కంపెనీలో పనిచేసి తాజాగా ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు అల్ఫాబెట్‌కు చెందిన మరో కీలక ఉద్యోగి తెలిపారు. మరి గూగుల్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇక్కడితోనైనా ఆగుతుందా.? కొనసాగుతుందా.? చూడాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..