Indian Railways: ఈ రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు అనుమతి: దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే తన నెట్‌వర్క్‌లో ట్రాక్ వేగ పరిమితిని పెంపొందించే దిశగా మౌలిక సదుపాయాల సాధనలో విజయవాడ-దువ్వాడ మధ్య గంటకు 130 కి.మీకి పెంచే ప్రక్రియను పూర్తి చేసింది...

Indian Railways: ఈ రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు అనుమతి: దక్షిణ మధ్య రైల్వే
Vande Bharat Express
Follow us
Subhash Goud

|

Updated on: Jan 24, 2023 | 4:35 PM

దక్షిణ మధ్య రైల్వే తన నెట్‌వర్క్‌లో ట్రాక్ వేగ పరిమితిని పెంపొందించే దిశగా మౌలిక సదుపాయాల సాధనలో విజయవాడ-దువ్వాడ మధ్య గంటకు 130 కి.మీకి పెంచే ప్రక్రియను పూర్తి చేసింది. 330.94 రూట్ కిమీల దూరం మేర ఉన్న ఈ సెక్షన్ లో గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను నడపడానికి ఆధునీకరించింది. ఈ ప్రక్రియతో జోన్‌లోని కీలకమైన స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణి విభాగాలలోని ట్రాక్‌ల గరిష్ట వేగాన్ని గంటకు 130 కిమీకి పెంచడం పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి సిహెచ్‌ రాకేష్‌ తెలిపారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కారణంగా ట్రాక్‌ పనులను వేగవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.

గత ఏడాది సెప్టెంబర్ నెలలో 744 రూట్ కి.మీ.లు మేర స్వర్ణ వికర్ణ విభాగాలైన అయిన బల్హర్షా – కాజీపేట – గూడూరులో గరిష్టంగా 130 కి.మీ. వేగాన్నిపెంచడానికి అనుమతి లభించింది. అలాగే స్వర్ణ చతుర్భుజి విభాగాలైన వాడి- గుంతకల్ -రేణిగుంట మార్గాల్లో 536 రూట్ కి.మీ. మేర కుడా అనుమతి లభించింది. వీటితోపాటు ఇదివరకే సికింద్రాబాద్-కాజీపేట మధ్య 132 రూట్ కిలోమీటర్ల హై డెన్సిటీ నెట్‌వర్క్‌కు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి అనుమతి ఇచ్చింది. దీనికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే (విజయవాడ – దువ్వాడ)లోని స్వర్ణ చతుర్భుజి ,స్వర్ణ వికర్ణి మార్గంలో చివరి సెక్షన్ సిగ్నలింగ్, ట్రాక్ పునరాభివృద్ది పనులు జరిగాయి. గరిష్టంగా గంటకు 130 కి. మీ వేగంతో రైళ్లను నడపడానికి సెక్షన్‌కు అనుమతి లభించింది.

రైల్ నెట్‌వర్క్ వేగ పరిమితి మెరుగుదల కోసం క్రమబద్ధమైన ప్రణాళికాబద్ధమైన విధానంతో ట్రాక్, ఇతర మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడంలో ఎదురైనా అడ్డంకులను తొలగించడం ద్వారా ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇందులో బరువైన పట్టాలను ఉంచడం, 260 మీటర్ల పొడవు గల వెల్డెడ్ రైలు ప్యానెల్‌లు వేయడం, వంపులు, ఎత్తు పల్లాలను సరిచేయడం, సిగ్నలింగ్ అంశాలు, ట్రాక్షన్ పంపిణీ పరికరాలను మెరుగుపరచడం, లోకోమోటివ్ అండ్‌ కోచ్‌ల అనుకూలతను పెంచడం మొదలైనవి ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

జోన్‌లో చేపడుతున్న స్పీడ్ పెంపుదలకు సంబంధించిన పనులు, రైళ్ల వేగాన్ని పెంచేందుకు అలాగే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా సామర్థ్యం పెంపుదల వల్ల అధిక వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి సిహెచ్‌. రాకేష్‌ అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే