AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulsar Bike: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఏంటంటే?

బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 250 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పోర్టీ లుక్ తో వచ్చే ఈ బైక్ లో అధునాతన ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. పల్సర్ అభిమానులు చూడాలనుకునే అధునాతన ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి. కూల్ టర్కోయిస్, గ్రే బాడీ గ్రాఫిక్స్, పెయింట్ ఫినిషింగ్ టచ్ తో ఈ బైక్ వస్తుంది.

Pulsar Bike: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఏంటంటే?
Pulsar Rs 250
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 24, 2023 | 5:55 PM

Share

పల్సర్ బైక్..రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతను ఆకట్టుకునే సూపర్ వెర్షన్ బైక్. పల్సర్ బైక్ సాంగ్ కూడా ఇటీవల వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే.. మిడిల్ క్లాస్ యువతకు అందుబాటులో ఉండే క్లాసిక్ బైక్ ఇది. బజాజ్ కంపెనీ రూపొందించిన ఈ బైక్ లో కొత్త వెర్షన్ రెడీ అవుతుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 250 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పోర్టీ లుక్ తో వచ్చే ఈ బైక్ లో అధునాతన ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. పల్సర్ అభిమానులు చూడాలనుకునే అధునాతన ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి. కూల్ టర్కోయిస్, గ్రే బాడీ గ్రాఫిక్స్, పెయింట్ ఫినిషింగ్ టచ్ తో ఈ బైక్ వస్తుంది. ఈ బైక్ అలాయ్ వీల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ విండ్ వైజర్ వల్ల ఈ బైక్ స్పోర్టీ లుక్ ను సొంతం చేసుకుంది. దీని ట్యాంక్ డిజైన్ కూడా స్పోర్ట్స్ బైక్ లానే వస్తుంది. స్ప్లిట్ సీట్ కచ్చితంగా రైడర్స్ కు సూపర్ ఫీలింగ్ ను ఇస్తుంది. అయితే ఇది ఎప్పటి నుంచి మార్కెట్ లో అందుబాటులోకి వస్తుందో మాత్రం వివరాలు లేవు. 

బీఎస్ 6 వెర్షన్ లో వచ్చే ఈ బైక్ 8750 ఆర్ పీఎం వద్ద 24.5 పీఎస్ శక్తిని  ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో వర్క్ చేసే ఈ బైక్ 250 సీసీ తో వస్తుంది. అలాగే 5 స్పీడ్ గేర్లతో వచ్చే ఈ బైక్ టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనో షాక్ రియర్ షాక్ అబ్జార్బర్ తో వస్తుంది. ఏబీఎస్ తో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.45 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ బైక్ ఉత్పత్తి ఎప్పటి నుంచి మొదలు కంపెనీ పేర్కొనలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కేవలం పలు సంస్థలు అందించే నివేదికల్లోని అంశాలు మాత్రమే అని గమనించాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం