- Telugu News Photo Gallery Business photos Bajaj pulsar 150 neon bs 6 take this bike home by downpayment rs 11000
ఈఎంఐలో బజాజ్ బైక్ తీసుకోవాలనుకుంటున్నారా..? నెలకు రూ.2500 కడితే చాలు.. బైక్ మీ సొంతం..!
Bajaj Pulsar: కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అది కూడా బజాజ్ కంపెనీ బైక్ కావాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ఈఎంఐ ...
Subhash Goud | Edited By: Shiva Prajapati
Updated on: Apr 13, 2021 | 8:51 AM

Bajaj Pulsar: కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అది కూడా బజాజ్ కంపెనీ బైక్ కావాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో మీరు బజాజ్ బైక్‌ను పొందవచ్చు. మీరు బజాబ్ పల్సర్ 150 నియోన్ బీఎస్ 6 బైక్ కొంనుగోలు చేయాలని భావిస్తే మీరు కొంత డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు రూ.11 వేలు కట్టారని అనుకుందాం... ఇంకా ఎక్కువ కడితే మంచిదే. కానీ బైక్ ధర రూ.1.12 లక్షలుగా ఉంది. మీరు రూ.11 వేలు కడితే రూ. లక్షకు రుణం తీసుకోవాలి.

మీరు బ్యాంకింగ్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి టూవీలర్ లోన్ పొందవచ్చు. 9.7 శాతం వడ్డీ రేటుకు రుణం తీసుకున్నారని భావిస్తే .. ఇప్పుడు మీకు నెలకు రూ.3,600 ఈఎంఐ పడుతుంది. ఇలా మీరు 36 నెలలు కట్టాలి. రూ.3,600 ఎక్కువ అనుకుంటే మీరు రుణం టెన్యూర్ పెంచుకోవచ్చు.

మీరు ఐదేళ్లకు రుణం టెన్యూర్ పెట్టుకుంటే అప్పుడు నెలకు ఈఎంఐ రూ.2500 పడుతుంది. ఇకపోతే ఈ బజాజ్ బైక్‌లో 150 సీసీ ఇంజిన్ ఉంటుంది. డిస్క్ బ్రేక్ ఆప్షన్‌లో లభిస్తుంది. ట్యబ్‌లెస్ టైర్లు కలిగి ఉంటాయి. సింగిల్‌ఛానల్ ఏబీఎస్ ఫీచర్ కూడా ఉంటుంది.w





























