Kia cars: దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్న కియా.. ఎలక్ట్రిక్ కారు కావాలంటే 2025 వరకు ఆగాల్సిందే..
కియా కంపెనీ మూడేళ్లలో ఆరు లక్షలకు పైగా కార్ల విక్రయాలు చేసింది. మొత్తం ఐదు మోడళ్లను ఆవిష్కరించింది. వీటి మార్కట్ ను మరింత పెంచేందుకు ఈ ఏడాది కొత్త కార్లను ఆవిష్కరించబోమని కియా వైస్ ప్రెసిడెంట్,మార్కెటింగ్, సేల్స్ హెడ్ హర్దీప్ బ్రార్ పేర్కొన్నారు.

కోరియన్ కార్ల కంపెనీ కియా ఇండియన్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తన అత్యాధునిక ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ తో కూడిన కార్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈక్రమంలో రికార్డు స్థాయిలో విక్రయాలు చేపట్టింది. 2022 క్యాలెండర్ ఇయర్ లో 2.54 లక్షల యూనిట్లను విక్రయించి దాదాపు 40 శాతం వృద్ధి ని అందుకుంది. మూడేళ్ల కాలంలో ఐదు కొత్త వాహనాలను అందించిన కియా.. వచ్చే ఏడాదిలో ఎటువంటి కొత్త మోడళ్లను ఆవిష్కరించడం లేదని ప్రకటించింది. రానున్న 12 నెలల్లో ఇప్పటికే ఉన్న ఉత్పత్తుల మార్కెట్ ను మరింత పెంచడంతో పాటు, వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ను అనుసరించి సరికొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు కియా వైస్ ప్రెసిడెంట్,మార్కెటింగ్, సేల్స్ హెడ్ హర్దీప్ బ్రార్ వెల్లడించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్లో తమ మొదటి మోడల్ ను 2025లోనే ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
సెల్టోస్ టాప్..
మన దేశంలో కియా కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2022 లో దాదాపు 254,000 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. 2022తో పోల్చుకుంటే ఇది 40 శాతం అధికం. మొత్తం ఆటో మొబైల్ ఇండస్ట్రీ వృద్ధితో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు ఉంది. ఈ మొత్తం విక్రయాల్లో కియా సెల్టోస్ కారు అత్యధికంగా అమ్ముడుబోయింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ, ఆర్థిక మాంద్యం ప్రభావాల నేపథ్యంలో డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని హర్దీప్ బ్రార్ అభిప్రాయపడ్డారు. ఈ సారి 5శాతానికి మించి వృద్ధి ఉండకపోవచ్చని ఆయన చెప్పారు.
2025లో కొత్త ఎలక్ట్రిక్ కారు..
కియా కంపెనీ మూడేళ్లలో ఆరు లక్షలకు పైగా కార్ల విక్రయాలు చేసింది. మొత్తం ఐదు మోడళ్లను ఆవిష్కరించింది. వీటి మార్కట్ ను మరింత పెంచేందుకు ఈ ఏడాది కొత్త కార్లను ఆవిష్కరించబోమని కియా వైస్ ప్రెసిడెంట్,మార్కెటింగ్, సేల్స్ హెడ్ హర్దీప్ బ్రార్ పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా భారతదేశంలో వీలైనన్నీ ఎక్కువ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 14 బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉండగా.. వాటిలో బెస్ట్ అయిన దానిని 2025లో భారత దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..







