Gautam Adani: ఆదానీ, అంబానీలకు ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన సంపద.. వారి స్థానంలో ఎవరంటే..
బిలియనీర్ గౌతమ్ అదానీకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆదానీ.. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయారు. ఆయన స్థానంలో అమెజాన్..
బిలియనీర్ గౌతమ్ అదానీకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆదానీ.. ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయారు. ఆయన స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ చేరారు. జెఫ్ బెజోస్ ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అదే సమయంలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు గౌతమ్ అదానీ సంపద 683 మిలియన్ డాలర్లు తగ్గింది. అదే సమయంలో టాప్ 15 మంది సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ కూడా 10 నుండి 12 స్థానాల్లోకి చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఆస్తి ఎంత తగ్గిందో చూడండి.
దీంతో ఆయన సంపద 120 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే అదానీ, బెజోస్‌ల సంపదలో పెద్దగా తేడా లేదు. బెజోస్ ఆస్తులు 121 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. అతని ఆస్తులు 188 బిలియన్ డాలర్లు. అదే సమయంలో ఎలోన్ మస్క్ $ 145 బిలియన్ల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు.
గౌతమ్ అదానీ సంపదకు 2023 సంవత్సరం అంత కలిసి రావడం లేదు. సంపద క్షీణించిన ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఆయన ఒక్కరే ఉన్నారు. అదానీ సంపద 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 683 మిలియన్ డాలర్లు తగ్గింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద $ 26 బిలియన్లు, మస్క్ $ 8.21 బిలియన్లు, బెజోస్ $ 13.8 బిలియన్లు పెరిగాయి.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ఏడాది సంపద తగ్గిన ప్రపంచంలోని టాప్-15 సంపన్నులలో గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ సంపద 683 మిలియన్ డాలర్ల మేర తగ్గింది. అదే సమయంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు ముఖేష్ అంబానీ సంపద 2.38 బిలియన్ డాలర్లు క్షీణించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ ఈ జాబితాలో టాప్-10లో ఉండగా, ఇప్పుడు 12వ స్థానంలో ఉన్నాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి