Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Air: భారత్‌లోకి అమెజాన్ ఎయిర్.. ప్రయాణం కోసం మాత్రం కాదు.. మరి దేని కోసమంటే..?

ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం ఈ నెలాఖరున లేదా వచ్చే ప్రారంభంలో దక్షిణాసియాలోని దేశాల్లో అమెజాన్ ఎయిర్ సేవలను చూడవచ్చని తెలిసింది. ముఖ్యంగా అతి పెద్ద మార్కెట్ ఉన్న భారత్ లో తన సొంత కార్గో సర్వీసులను ప్రారంభించడం వల్ల డెలివరీలు మరింత వేగంగా అందించవచ్చని సంస్థ భావిస్తుంది. 2016 అమెజాన్ వన్ పేరుతో సొంత కార్గో సర్వీస్ లాంచ్ చేసింది.

Amazon Air: భారత్‌లోకి అమెజాన్ ఎయిర్.. ప్రయాణం కోసం మాత్రం కాదు.. మరి దేని కోసమంటే..?
Amazon Air
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 4:31 PM

భారత్ లో ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ ఎయిర్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వెల్లడైన నివేదికల ప్రకారం ఈ నెలాఖరున లేదా వచ్చే ప్రారంభంలో దక్షిణాసియాలోని దేశాల్లో అమెజాన్ ఎయిర్ సేవలను చూడవచ్చని తెలిసింది. ముఖ్యంగా అతి పెద్ద మార్కెట్ ఉన్న భారత్ లో తన సొంత కార్గో సర్వీసులను ప్రారంభించడం వల్ల డెలివరీలు మరింత వేగంగా అందించవచ్చని సంస్థ భావిస్తుంది. 2016 అమెజాన్ వన్ పేరుతో సొంత కార్గో సర్వీస్ లాంచ్ చేసింది. ఆరేళ్లలో అమెజాన్ ఎయిర్ అమెజాన్ కార్గో సర్వీసులకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం అమెజాన్ ఎయిర్ కు తన గ్లోబల్ నెట్ వర్క్ లో దాదాపు 110 విమానాలకు పైగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్ నిర్వహించిన ఓ సమావేశంలో పది ఎయిర్ బస్ లు ఏ 330-300 లను కంపెనీకు జోడిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటిని ప్యాసెంజర్ సర్వీస్ కార్గో సర్వీసులను మార్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి 2023 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత్ అమెజాన్ ఎయిర్ కు బెంగళూరుకు చెందిన కార్గో విమానయాన సంస్థ క్విక్ జెట్ సేవలను అందించనుంది. క్విక్ జెట్ ను 2007 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 22 సంవత్సరాల క్రితం మోడల్స్ అయిన బోయింగ్ 737-800 ( బీసీఎఫ్) రెండు ఉన్నాయి. వీటి రెండింటితో అమెజాన్ ఎయిర్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ బోయింగ్ విమానాల సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి ఆరుకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. బోయింగ్ 737-800 బీసీఎఫ్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా త్వరగా అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ విమానం గరిష్టంగా 79,000 కిలోల టేకాఫ్ బరువును కలిగి ఉంది. ఇది 3,700 కిలోమీటర్ల (1,995 నాటికల్ మైళ్లు) డిజైన్ పరిధిని కలిగి ఉంది. ఈ విమానాలు బోయింగ్ 737-300SF కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటాయి. అలాగే ఈ విమానం 24 టన్నుల కార్గో సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 108 బోయింగ్ 737-800 బీసీఎఫ్ విమానాలను 32 సంస్థలు నిర్వహిస్తున్నాయి. అలాగే అమెజాన్ ఎయిర్ సంస్థ వద్ద ఏటీఆర్ ఐదు, 30 బోయింగ్ 737 లు, 56 బోయింగ్ 767 లను ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే భారత్ లో వ్యాపారం పెంచుకునేందుకు అమెజాన్ ఎయిర్ ఆ సంస్థకు ఏ మాత్రం ఉపయోగపడుతుందో మాత్రం వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..