AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime Air: అమెరికా, యూరప్‌ తర్వాత మన హైదరాబాద్‌లోనే.. అందుబాటులోకి అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌ సేవలు.

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతోంది. ముఖ్యంగా భారత్‌లో అమెజాన్‌ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా బుకింగ్స్‌ను డెలివరీ చేసేందుకు గాను తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది....

Amazon Prime Air: అమెరికా, యూరప్‌ తర్వాత మన హైదరాబాద్‌లోనే.. అందుబాటులోకి అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌ సేవలు.
Amazon Air
Narender Vaitla
|

Updated on: Jan 23, 2023 | 5:17 PM

Share

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతోంది. ముఖ్యంగా భారత్‌లో అమెజాన్‌ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా బుకింగ్స్‌ను డెలివరీ చేసేందుకు గాను తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ సేవలను అమెరికా, యూరప్‌ తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభించడం విశేషం. అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌ను అందిస్తోన్న మూడో దేశంగా భారత్‌, పట్టణంగా హైదరాబాద్‌ నిలిచింది. మంత్రి కేటీఆర్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను ప్రారంభించారు.

అమెరికా, యూరప్ తర్వాత భారతదేశంలో అమెజాన్ ఎయిర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం బోయింగ్ 737-800 విమానాల పూర్తి కార్గో సామర్థ్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. దీని ద్వారా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ నగరాల్లో వేగవంతమైన డెలివరీలను అందించే అవకాశం ఉంది. కంపెనీ ప్రారంభిస్తున్న ఈ సర్వీస్ రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచటంతో పాటు డెలివరీల వేగవంతాన్ని సులభతరం చేస్తుంది. వేగంగా డెలివరీ చేసే క్రమంలో అమెజాన్ బెంగుళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌తో జతకట్టింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే అమెజాన్‌ ఎయిర్‌ కార్గో సేవలను ప్రారంభించిన తర్వత మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఏవియేషన్‌ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. గత ఏడేళ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వివరించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ అన్న కేటీఆర్‌.. హైదరాబాద్‌ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకుందన్నారు. అమెజాన్‌ ఎయిర్‌ ప్రస్తుతం రెండు కార్గో సర్వీసులను మాత్రమే నడుపుతోందని , వీటి సంఖ్యను పెంచాలని మంత్రి కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో