Hyderabad: మునిగిన బుద్దుడి విగ్రహాన్ని ఎలా బయటకు తీశారు.. అప్పుడు ఎంతమంది చనిపోయారు…?

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఒకే రాతితో మలచబడింది. డిసెంబర్ 1, 1992లో దీన్ని ప్రతిష్టించారు. దీని గురించి మరిన్న వివరాలు, విశేషాలు మీ కోసం....

Hyderabad: మునిగిన బుద్దుడి విగ్రహాన్ని ఎలా బయటకు తీశారు.. అప్పుడు ఎంతమంది చనిపోయారు...?
Hussain Sagar Buddha
Follow us

|

Updated on: Jan 23, 2023 | 12:41 PM

హైదారాబాద్ అనగానే మనకు గుర్తుకువచ్చేది చార్మినార్. ఆ తర్వాత హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం. టాంక్‌బండ్ పక్కనున్న హుస్సేన్ సాగర్‌లో ‘జిబ్రాల్టర్ రాక్’ అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 మీటర్ల (58 అడుగులు) ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. ఈ విగ్రహాన్ని అన్న ఎన్టీయార్ చొరవతో ఏర్పాటు చేశారని మాత్రమే తెల్సు. దీని ఏర్పాటు జరిగి గత డిసెంబర్ 1కి 30 ఏళ్లు కంప్లీట్ అయ్యింది. అసలు దీని నిర్మాణం వెనుక కారణం ఏంటి..? విగ్రహం ఏర్పాటు సమయంలో ఎందుకు మునిగిపోయింది. బయటకు ఎలా తీశారు అనే అంశాలపై చాలామందికి అవగాహన లేదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1983లో సీఎం అయ్యాక ఎన్టీఆర్ పలుమార్లు అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూశారు. అమెరికా అంటే వైట్ హౌస్‌తో పాటు ఇది ఠక్కున గుర్తుకు వస్తుంది. అంత సుందరంగా ఉంటుంది మరి. అలానే మన దగ్గర కూడా ఓ ఐకానిక్ స్టాట్యూ ఉండాలని రామారావు గారు భావించారు. ఈ క్రమంలోనే చర్చలు జరిపి.. సత్యాన్వేషి, శాంతికి మారుపేరైన బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాదుకు 60 కి.మీ. దూరంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని రామగిరి-భువనగిరి గుట్టల్లోని రాతితో.. SM గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలచారు. ఈ శిల్పాన్ని 192 చక్రాలు గల వాహనంపై హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకువచ్చారు. దేశంలో అత్యంత పెద్దదైన ఈ బుద్ధుడి ఏకశిల విగ్రహం కోసం టీడీపీ సర్కార్ అప్పట్లో దాదాపు 5.5 కోట్ల రూపాయలను వెచ్చించింది.

ఈ విగ్రహాన్ని మొదట 1990 మార్చి 10న ప్రతిష్టించే ప్రయత్నం చేయగా అది ఫలించలేదు. హుస్సేన్ సాగర్ లో 91 మీటర్లు తరలించిన తర్వాత విగ్రహం అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు మరణించారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు కూడా ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ కథనాలు వండి వార్చాయి. ఎన్టీఆర్ డబ్బు వృథా చేస్తున్నారని.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి పోటీకి చేసే ప్రయత్నం విఫలమైందని అమెరికా పత్రికలు వార్తలు రాశాయి. అప్పట్నుంచి ఆ విగ్రహాన్ని వెలికి తీసేందుకు వివిధ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాంగ్రెస్ హయాంలో 1992 నవంబర్‌లో ప్రత్యేక క్రేన్లు నేవీ హెలికాప్టర్ల సాయంతో.. విగ్రహాన్ని బయటకు తీశారు. 1992 డిసెంబర్ 1న ఎట్టకేలకు దీన్ని దీనిని ప్రతిష్ఠించారు. మళ్లీ ఎన్టీఆర్ సీఎం అయ్యాక.. సుందరీకరణ పనులు చేయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..