Toyota Cars Recall: 1390 టయోటా కార్లు రీకాల్.. కారణం ఏంటంటే..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. మార్కెట్ నుంచి 1390 కార్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో..
Updated on: Jan 24, 2023 | 5:35 PM

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. మార్కెట్ నుంచి 1390 కార్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో సాంకేతిక లోపం తలెత్తినందున వాటిని రీ కాల్ చేస్తున్నట్లు తెలిపింది.

2022 డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈ నెల 12 మధ్య తయారైన కార్లను రీకాల్ చేస్తున్నామని పేర్కొంది. బాధిత కార్ల వినియోగదారులు వెంటనే తమ డీలర్‌లను సంప్రదించాలని సూచించింది.

ఉచితంగా ఆయా కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ రీ ప్లేస్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులు తమ కారు `వీఐఎన్ (వీఐఎన్) నంబర్` ఉపయోగించి సంబంధిత కారులో ఆ సమస్య ఉందా? అన్న విషయం తెలుసుకోవాలని వెల్లడించింది.

ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ రీ ప్లేస్ చేసేవరకు ఆయా కార్ల వాడకం తగ్గించాలని స్పష్టం చేసింది. వాహనదారులు ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండాలని, సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది.

అయితే ఈ కార్ ఎయిర్ బ్యాగ్స్ విషయంలో సాంకేతిక లోపాలు ఉన్నందున కంపెనీ ముందస్తుగా స్పందించి కార్లను రీకాల్‌కు అనుమతి ఇచ్చింది. వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండానే ఉచితంగా సమస్యను పరిష్కరించి ఇస్తోంది కంపెనీ.





























