Concession in Rail Ticket: ఈ బడ్జెట్‌లో వారికి రైలు టికెట్లలో రాయితీ తిరిగి ప్రకటించనుందా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023 ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు . ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు అనేక అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో సీతారామన్..

Concession in Rail Ticket: ఈ బడ్జెట్‌లో వారికి రైలు టికెట్లలో రాయితీ తిరిగి ప్రకటించనుందా..?
Budget 2023-24
Follow us
Subhash Goud

|

Updated on: Jan 23, 2023 | 9:46 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023 ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు . ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు అనేక అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో సీతారామన్ సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై తగ్గింపును తిరిగి ప్రకటించవచ్చని అంచనా. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి బడ్జెట్. వచ్చే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబుల మార్పును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఊహించినట్లుగానే ఈ బడ్జెట్ రైల్వేలు, ఇతర సీనియర్ సిటిజన్లకు రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది.

అయితే రైల్వే మంత్రి ఇటీవల చేసిన ప్రసంగంలో సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీకి సంబంధించి ఎటువంటి సమస్య రాలేదని అన్నారు. భారతీయ రైల్వేలు గత కొన్ని నెలలుగా మంచి ఆదాయాన్ని కలిగి ఉన్నాయన్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 9 నెలల్లో రైల్వే ఛార్జీల ద్వారానే 48,913 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. 2021తో పోలిస్తే భారతీయ రైల్వేకు 71 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. అందుకే వచ్చే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై తగ్గింపును నిర్మలమ్మ తిరిగి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు రైల్వే ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై కొంత మొత్తంలో తగ్గింపు ఇచ్చింది. అయితే కరోనా సమయంలో రైలు ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత దశల వారీగా రైళ్లు మళ్లీ పట్టాలు ఎక్కాయి. కరోనా సమయంలో భారతీయ రైల్వే కొంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది. అప్పటి సీనియర్‌ సిటిజన్లకు ఈ మినహాయింపు నిలిపివేసింది. 2019 నుండి ఆ తగ్గింపు ఇప్పటి వరకు కొనసాగించలేదు. గతంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. అయితే సీనియర్ సిటిజన్లకు మినహాయింపును తిరిగి తీసుకురాకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కొనసాగించింది. ఇంతకుముందు 60 ఏళ్లు పైబడిన వారికి ఛార్జీలపై 40 శాతం తగ్గింపు ఇచ్చింది కేంద్రం. అలాగే 58 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు 50 శాతం తగ్గింపు లభిస్తుంది. బడ్జెట్‌ సందర్భంగా నిలిపివేసిన సదుపాయాన్ని మళ్లీ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి