Union Budget 2023: బడ్జెట్‌లో కొన్ని పదాలు పదే పదే ఉపయోగిస్తారు..? వాటి అర్థాలు ఏంటో తెలుసా..?

మోడీ ప్రభుత్వం రెండవసారి చివరి పూర్తి బడ్జెట్ త్వరలో సమర్పించబడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 1, 2023న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024 ఎన్నికలు..

Union Budget 2023: బడ్జెట్‌లో కొన్ని పదాలు పదే పదే ఉపయోగిస్తారు..? వాటి అర్థాలు ఏంటో తెలుసా..?
Union Budget
Follow us

|

Updated on: Jan 23, 2023 | 5:40 PM

మోడీ ప్రభుత్వం రెండవసారి చివరి పూర్తి బడ్జెట్ త్వరలో సమర్పించబడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 1, 2023న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024 ఎన్నికలు రానున్నాయి. అందుకే మోడీ సర్కార్‌కు ఇది చివరి బడ్జెట్‌. దేశంలోని మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ ఏడాది ప్రభుత్వం పన్ను శ్లాబ్‌లో మార్పులు చేస్తుందని పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి మాట్లాడే కొన్నిపదాలు సామాన్యులకు అర్థం కాకుండా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పదాల అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు బడ్జెట్ నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రసంగంలో ఉపయోగించే సాధారణ పదాల గురించి తెలుసుకుందాం.

ఆర్థిక లోటు అంటే ఏమిటి?

బడ్జెట్‌లో ఆర్థిక లోటు అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తుంటారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఆర్థిక లోటు అంటారు. ఈ లోటు దేశ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆర్థిక లోటు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్రవ్య లోటును 6.3 శాతం నుండి 6.5 శాతానికి ఉంచవచ్చు.

ప్రత్యక్ష పన్ను అంటే ఏమిటి?

ఇది డైరెక్ట్ టాక్స్ పేరుతో మాత్రమే పిలుస్తారు. ప్రత్యక్ష పన్ను అంటే ప్రభుత్వం నేరుగా పొందుతున్న పన్ను. ఈ పన్ను నేరుగా ఆదాయంపై విధించబడుతుంది. ఆదాయపు పన్నుగా నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ చేయబడుతుంది. ఆదాయపు పన్నుతో పాటు కార్పొరేట్ పన్ను, సంపద పన్నులను ప్రత్యక్ష పన్నులుగా వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

పరోక్ష పన్ను అంటే ఏమిటి?

పరోక్ష పన్ను అనేది నేరుగా వసూలు చేయని ఒక సేవ ద్వారా వసూలు చేసే పన్ను. ఏదైనా సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్, ప్రొడక్ట్ మొదలైన వాటిపై ఈ పన్ను విధిస్తారు. ప్రతి వ్యాపారి చెల్లించాల్సిన అత్యంత సాధారణ పరోక్ష పన్ను జీఎస్టీ అని. ఇది కాకుండా ఉత్పత్తి ఛార్జీ, సర్వీస్ ఛార్జీ మొదలైన పన్నులు పరోక్ష పన్ను వర్గంలోకి వస్తాయి.

ఇతర సాధారణ పదాలకు అర్థం తెలుసా?

ఇది కాకుండా, బడ్జెట్‌లో ఎక్కువగా ఉపయోగించే పదం ఆర్థిక సంవత్సరం. ప్రభుత్వం తన బడ్జెట్‌ను ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా ప్లాన్ చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ వ్యవధి మధ్యలో ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన బడ్జెట్, ఆదాయం, పన్నును లెక్కిస్తుంది. అంతే కాకుండా బడ్జెట్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనే పదాన్ని కూడా ఎక్కువగా వాడారు. దీన్ని దేశంలో తయారు చేసిన మొత్తం ఉత్పత్తి, సేవల విలువ అంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..