Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: ఆదాయపు పన్ను విధానంలో కీలక మార్పులు.. వారికి ఊరట..!

రానున్న బడ్జెట్‌పై ఎంతో మంది కోటి ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఏయే వర్గాల వారికి మేలు..

Budget 2023: ఆదాయపు పన్ను విధానంలో కీలక మార్పులు..  వారికి ఊరట..!
Budget 2023
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2023 | 11:10 AM

రానున్న బడ్జెట్‌పై ఎంతో మంది కోటి ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఏయే వర్గాల వారికి మేలు జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పన్ను చెల్లింపుల విషయంలో ఆశలు పెట్టుకున్నారు. మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్‌లపై 2022 డేటా ప్రకారం.. జీతం పొందిన వ్యక్తులు ఐటీఆర్‌1 ద్వారా 50 శాతం పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రిచే కేంద్ర బడ్జెట్ 2023 ప్రకటనకు ముందు జీతభత్యాల ఉద్యోగులు పన్ను మినహాయింపులు, స్లాబ్ రేట్ల పెంపుపై కొన్ని ప్రధాన ప్రకటనలను ఆశిస్తున్నారు.

జీతభత్యాల ఉద్యోగులు ప్రధాన పన్ను మినహాయింపును ఆశించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, జీవన వ్యయం, పెట్టుబడి లేదా బీమా ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటికీ, పన్ను ఆదా 2014 నుండి ఇప్పటికీ అదే విధంగా ఉంది. ఇది కొంత కాలం పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ఒక ప్రధాన అవకాశాన్ని అందించింది. జీతభత్యాల ఉద్యోగుల జీవన సౌలభ్యం కోసం ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని సవరణలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఆదాయపు పన్ను విషయంలో ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించిన కొత్త పన్ను వ్యవస్థలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త పన్ను వ్యవస్థలో ట్యాక్స్ రేట్లను తగ్గిచటం, వాటికి అనుగుణంగా పన్ను స్లాబ్‌లను మార్చి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆదాయపు పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాత పద్ధతిలో కేవలం మూడు స్లాబ్‌లే ఉన్నాయి. అయితే కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లను తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎంత ఆదాయానికి ఎంత పన్ను విధిస్తున్నారు..?

  1. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను
  2. రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం
  3. రూ.7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 15 శాతం
  4. రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం
  5. రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం
  6. రూ.15 లక్షలు ఆపైన ఆదాయం ఆర్జించే వారికి 30 శాతం

అయితే, పాత పన్ను విధానం కావాలా లేదా కొత్త పన్ను పరిధిలోకి రావాలా? అనే విషయం చెల్లింపుదారులే నిర్ణయించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది.

పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగనుందా..?

ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెంపు, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించే అశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్య తరగతికి భారీగా ఊరట కల్పించేందుకు కొత్త పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి