Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: రైలు ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక చౌకగా వందే భారత్ రైలు టిక్కెట్లు

భారతీయ రైల్వే వందే భారత్‌కు సంబంధించి భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రైలు నెట్‌వర్క్‌ను పెంచేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి.

Vande Bharat Express: రైలు ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక చౌకగా వందే భారత్ రైలు టిక్కెట్లు
Vande Bharat Express
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2023 | 10:34 AM

భారతీయ రైల్వే వందే భారత్‌కు సంబంధించి భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రైలు నెట్‌వర్క్‌ను పెంచేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైలులో టికెట్‌ ధరలు భారీగా ఉన్నాయి. అయితే ప్రయాణాన్ని చౌకగా చేసేందుకు స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్లీపర్ కోచ్ కారణంగా రైలు టిక్కెట్ కూడా చౌకగా మారుతుంది. దీంతో ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తప్పడం లేదు.

  • స్పీడ్ గంటకు 200 కి.మీ: మీడియా నివేదికల ప్రకారం.. స్లీపర్ కోచ్‌తో వందే భారత్ రైలు వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటుంది. ఈ రైలులోని స్లీపర్ కోచ్‌ను అల్యూమినియంతో తయారు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లు దేశవ్యాప్తంగా నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ కోచ్‌లకు ప్రత్యామ్నాయంగా మారనున్నాయి . దాదాపు 400 వందే భారత్ రైళ్లకు రైల్వే శాఖ టెండర్లు జారీ చేయగా, నెలాఖరులోగా ఆమోదం పొందనుంది.
  • రైలు ఎంత వేగంతో నడుస్తుంది?: ఈ రైళ్ల నిర్మాణ పనుల కోసం 4 దేశీయ కంపెనీలతో సహా విదేశీ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. మొదటి 200 వందే భారత్ రైళ్లలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ రైళ్లు గంటకు 180 కి.మీ.
  • రైలు పట్టాల భద్రతపై శ్రద్ధ: రైలు ట్రాక్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంటకు 130 కిమీ వేగంతో నడిచేందుకు అనుమతిని పొందనున్నట్లు రైల్వే తెలిపింది. దీనితోపాటు చైర్ కార్ రైళ్లను ఉక్కుతో తయారు చేయనున్నారు.
  • రెండో దశలో 200 రైళ్లు: ఇక రెండో దశలో 200 స్లీపర్‌ కోచ్‌లతో వందేభారత్‌ రైళ్లను తయారు చేస్తామని రైల్వే తెలిపింది. ఈ రైళ్ల తయారీకి అల్యూమినియం వినియోగించనున్నారు. ఇందుకోసం రైల్వే ట్రాక్‌కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు సిగ్నల్, బ్రిడ్జి పనులు కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై మధ్య ఈ పని జరుగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..