Discount Offers: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఈ రెండు కార్లపై భారీ తగ్గింపు.. రూ.1.2 లక్షలు ఆదా
కొత్త సంవత్సరంలో కార్లపై ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి కంపెనీలు. 2022 స్టాక్‌ను క్లియర్ చేయడానికి కార్ కంపెనీలు బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. కొత్త కారును కొనుగోలు చేసే వారికి ఇది..
కొత్త సంవత్సరంలో కార్లపై ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి కంపెనీలు. 2022 స్టాక్‌ను క్లియర్ చేయడానికి కార్ కంపెనీలు బంపర్ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. కొత్త కారును కొనుగోలు చేసే వారికి ఇది గొప్ప వార్తేనని చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో కారు కొనుగోలు చేయడం ద్వారా వారు భారీ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎస్‌యూవీ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినట్లయితే టాటా మోటార్స్ హారియర్, సఫారి అనే రెండు ప్రసిద్ధ మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ రెండు ఎస్‌యూవీలపై రూ. 1.2 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. అయితే హారియర్ లేదా సఫారిని కొనుగోలు చేసే ముందు ఒకసారి టాటా డీలర్‌షిప్ నుండి వివరాలు తెలుసుకోండి.
ఈ తగ్గింపు ఆఫర్‌లు హ్యారియర్, సఫారి ఆప్షన్ చేసిన వేరియంట్‌ల కోసమే. అదే సమయంలో వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న స్టాక్ ఆధారంగా డిస్కౌంట్ పరిమితిని నిర్ణయించవచ్చు. అందువల్ల, కారును కొనుగోలు చేసే ముందు ధర, తగ్గింపు, ఇతర సమాచారాన్ని పొందడానికి కంపెనీ షోరూమ్‌ను సందర్శించడం మంచిది. తరువాత టాటా మోటార్స్ రెండు SUVలపై ఇంత భారీ తగ్గింపును ఎలా అందజేస్తుందో చూద్దాం.
అందుకే బంపర్ డిస్కౌంట్..
దేశంలోని ప్రముఖ ఆటో కంపెనీ లైనప్‌ను మరింత పటిష్టం చేసేందుకు యోచిస్తోంది. హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లను అతి త్వరలో తీసుకురావడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. అందుకే అమ్ముడుపోకుండా మిగిలిపోయిన 2022 మోడల్ కార్ల స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. తద్వారా స్టాక్ వీలైనంత త్వరగా ముగింపు చేసి కొత్త వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.
టాటా హారియర్: రూ. 1.2 లక్షల తగ్గింపు:
టాటా స్టైలిష్ ఎస్‌యూవీ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. విశాలమైన ఇంటీరియర్స్, ఆటో గేర్‌బాక్స్, నిర్మాణ నాణ్యతతో ప్రత్యేకంగా తయారై ఉంటుంది. డీజిల్ ఇంజన్‌లో మాత్రమే వచ్చే ఈ కారు రూ.1.2 లక్షల వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఈ కారు భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన MG హెక్టర్‌తో పోటీపడుతుంది.
టాటా సఫారి: రూ. 1.2 లక్షల తగ్గింపు:
హారియర్ మాదిరిగానే టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సఫారి కూడా రూ. 1.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. దీని ఇంజన్ కూడా హారియర్‌ని పోలి ఉంటుంది. ఈ కారు మూడు వరుసల సీటింగ్‌తో వస్తుంది. టాటా సఫారీని చాలా మంది ఎంతో కాలంగా ఇష్టపడుతున్నారు. అద్భుతమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో ఈ కారు డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇది మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్‌లకు పోటీగా ఉంది. మొత్తం ఆఫర్‌ను తెలుసుకోవాలంటే సమీపంలో ఉన్న షోరూమ్‌ను సందర్శిస్తే పూర్తి వివరాలు అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి