AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనుషులే కాదు.. అపరిచితులు ఇచ్చే ఆహారం పట్ల జంతువులకు కూడా భయమేనండోయ్..

అదే సమయంలో చాలా మంది వినియోగదారులు తల్లి చేసిన పనిని మెచ్చుకున్నారు, ఈ వీడియోను 'అందమైనది' 'వెరీ స్మార్ట్' అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Viral Video: మనుషులే కాదు..  అపరిచితులు ఇచ్చే ఆహారం పట్ల జంతువులకు కూడా భయమేనండోయ్..
Monkey
Jyothi Gadda
|

Updated on: Jan 27, 2023 | 1:16 PM

Share

కోతులు చేసే వింత పనులకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. ప్రజలు కూడా అలాంటి వీడియోలను చాలా ఇష్టపడతారు. ఈ రోజుల్లో ఇలాంటి అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో జంతువులు ఏదో ఒక విచిత్రం చేస్తున్నాయని, వాటిని చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతుంటారు. అలాంటి వీడియోలు మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత అందంగా ఉంటున్నాయి.. తాజాగా అలాంటిదే ఓ వానరం తన బిడ్డతో కలిసి చేసిన వింత పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అపరిచితుల నుండి ఆహార పదార్థాలను తీసుకోవద్దని ఒక కోతి తన బిడ్డకు బోధిస్తూ కనిపించే ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

జనవరి 22న షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక కోతి తన బిడ్డకు అపరిచితుల నుండి ఆహారం తీసుకోవద్దని బోధిస్తోంది.. ఇదే శీర్షికతో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. వీడియో ప్రారంభంలో, ఒక అపరిచితుడు కోతి పిల్లకి ఏదో ఆహారం అందిస్తున్నాడు. ఆ పిల్ల కోతి అతను ఇచ్చే పండు తీసుకోవడానికి ముందుకు దూకింది. కానీ, పిల్లకోతి పండు తీసుకోవడానికి ముందుకు రాగానే, మామిడిపండు తింటున్న ఆ తల్లి కోతి తన బిడ్డను వెనక్కి లాగేసుకుంది. అప్పటికే తల్లి కోతి మామిడిపండు తినడంలో బిజీగా ఉంది. అయినప్పటికీ ఇది గమనించి వెంటనే తన బిడ్డను అజ్ఞాత వ్యక్తి ఇచ్చే పండు తీసుకోకుండా పదేపదే ఆపుతుంది. కోతిపిల్ల మాత్రం అతడు ఇచ్చిన పండ్లను తీసుకోవడానికి ట్రై చేస్తుంది.. కానీ ప్రతిసారీ తల్లి కోతి అడ్డుపడుతుంది. ఈ ప్రయత్నంలో మూడోసారి పండు అందుకోబోతుంది.. అంతలోనే తల్లి కోతి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. కోతిపిల్లకు పండు ఇస్తున్న ఆ వ్యక్తిపైకి గుర్రుగా లేచింది. అది చూస్తే మనకే భయం వేసేంతగా భయపెట్టింది.

ఇవి కూడా చదవండి

— ?o̴g̴ (@Yoda4ever) జనవరి 22, 2023న ఈ వీడియోను అప్‌లోడ్‌ చేయగా, ఇప్పటివరకు 1.4 మిలియన్ సార్లు వీక్షించారు. అదే సమయంలో, ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. తెలియని వ్యక్తులు పెట్టే ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదని ఆ తల్లి బిడ్డకు నేర్పుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి తోటి మనుషులే కాదు, జంతువులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో సూచిస్తుందంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు. అదే సమయంలో చాలా మంది వినియోగదారులు తల్లి చేసిన పనిని మెచ్చుకున్నారు, ఈ వీడియోను ‘అందమైనది’ ‘వెరీ స్మార్ట్’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..