Astrology Tips: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు వెరీ వెరీ లక్కీ అట.. తల్లిదండ్రులకు అదృష్టాన్ని పేరుని తెస్తారట..

న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీ ఆధారంగా అతని అదృష్టం ఆధారపడి ఉంటుందని.. నిర్దిష్ట తేదీల్లో  జన్మించిన వ్యక్తులు .. తమ తల్లిదండ్రులకు అదృష్టాన్ని తెస్తారని విశ్వాసం. పుట్టిన తర్వాత మెుత్తం ఫ్యామిల్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది.

Astrology Tips: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు వెరీ వెరీ లక్కీ అట.. తల్లిదండ్రులకు అదృష్టాన్ని పేరుని తెస్తారట..
Numerology
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2023 | 10:33 AM

జ్యోతిష్య శాస్త్రంలో మనిషి పుట్టిన సమయాన్ని, ప్రాంతాన్ని బట్టి అతని భవిష్యత్ ను ఎలా అంచనా వేస్తారో.. న్యూమరాలజీలో కూడా పుట్టిన తేదీ ఆధారంగా భవిష్యత్‌ను కొంత వరకు అంచనా వేస్తారు.  పుట్టిన అంకెల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు భవిష్యత్ లో జరగనున్న మంచి చెడులను అంచనా వేస్తారు. ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ నిపుణులు అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీ ఆధారంగా అతని అదృష్టం ఆధారపడి ఉంటుందని.. నిర్దిష్ట తేదీల్లో  జన్మించిన వ్యక్తులు .. తమ తల్లిదండ్రులకు అదృష్టాన్ని తెస్తారని విశ్వాసం. పుట్టిన తర్వాత మెుత్తం ఫ్యామిల్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. అంతేకాదు ఇలాంటి పిల్లలు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదను కలిగి ఉంటారని భావిస్తారు.

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ 7 గల వ్యక్తులు చాలా లక్కీ పర్సన్స్. ఏదైనా నెలలో 7, 16 , 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు రాడిక్స్ సంఖ్య 7 కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమని సొంతం చేసుకుంటారు. అంతేకాదు  పిల్లలు చిన్న వయసులోనే విజయాన్ని సాధిస్తారు. వీరు కుటుంబ సభ్యుల ప్రేమను పొందుతారు. స్వచ్ఛమైన హృదయంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ వ్యక్తులు విభిన్న గుర్తింపుతోపాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు

న్యూమరాలజీ ప్రకారం..  7 సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనిని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక రాడిక్స్ సంఖ్య 7లో జన్మించిన పిల్లలు చాలా అదృష్టవంతులుగా న్యూమరాలజీ పేర్కొంది. వీరు అత్యంత తెలివితేటలు కలిగి ఉంటారు. చేపట్టిన పనిలో విజయం సాధించడానికి ఎంతటి కష్టం వచ్చినా వెనుకడుగువేయరు. వీరి జీవితంలో ఏర్పడే ప్రతి మలుపులోనూ అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో చాలా వేగంగా విజయాన్ని అందుకుంటారు.  అన్నింటా సక్సెస్ అందుకోవడమే కాదు.. సంపదను భారీగా పోగుచేస్తారు. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత అన్న మాటే ఉండదు.   నిరుపేదలకు కూడా  సాయం చేయడానికి ముందు ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)