AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. గోవిందా నామ స్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు..

నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. శనివారం రాత్రి నిర్వహించిన రథోత్సవం లో గ్రామ ప్రజలు..

Telangana: ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. గోవిందా నామ స్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు..
Brahmotsavalu
Ganesh Mudavath
|

Updated on: Jan 29, 2023 | 11:53 AM

Share

నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. శనివారం రాత్రి నిర్వహించిన రథోత్సవం లో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ విధులన్నీ గోవిందా నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం నుంచి వారం రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున్న పాల్గొని స్వామి వారి దీవెనలు పొందాలన్నారు.

ఉత్సవాల్లో భాగంగా నిత్యారాధన, అభిషేకం, ప్రబంధ పారాయణం, హోమబలిహరణం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, తీర్థ ప్రసాదాలు అందించడం వంటి క్రతువులు నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా, భక్తుల హరినామస్మరణల మధ్య పల్లకిసేవ, రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మలు, మిఠాయి దుకాణాల వద్ద భక్తులు సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..