Amshala Swamy: ఫ్లోరైడ్‌‌ రక్కసిపై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత.. కేటీఆర్‌ సంతాపం..

Fluorosis victim Amshala Swamy dies: నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన ఫ్లోరోసిస్‌ బాధితుడు 32ఏళ్ల అంశాల స్వామి చనిపోయారు. అనారోగ్యంతో శనివారం ఉదయం మృతిచెందారు..

Amshala Swamy: ఫ్లోరైడ్‌‌ రక్కసిపై సుదీర్ఘ పోరాటం చేసిన అంశాల స్వామి కన్నుమూత.. కేటీఆర్‌ సంతాపం..
Amshala Swamy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2023 | 1:26 PM

Fluorosis victim Amshala Swamy dies: నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన ఫ్లోరోసిస్‌ బాధితుడు 32ఏళ్ల అంశాల స్వామి చనిపోయారు. అనారోగ్యంతో శనివారం ఉదయం మృతిచెందారు. చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడిన అంశాల స్వామి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టేందుకు అవిశ్రాంతంగా పోరాడారు. జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యను జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లారు అంశాల స్వామి. శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడ్డారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగా చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా, అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఫ్లోరోసిస్ బాధితుడైన స్వామి ఫ్లోరైడ్‌ సమస్యపై ఆయన పోరాడిన విధానం.. ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పారు. ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతారన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్.

గతేడాది అక్టోబర్‌ 13న మంత్రి కేటీఆర్‌ అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. స్వయంగా స్వామికి అన్నం వడ్డించారు. ఆయన తల్లితండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్రూం సైతం మంజూరు చేయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..