Prabhas: ‘హైదరాబాద్కు ఆ ఘనత దక్కినందుకు గర్వంగా ఉంది’.. కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్..
ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు ప్రభాస్. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ వేదికపై హైదరాబాద్ మోటార్ స్పోర్ట్స్ తనదైన ముద్ర వేయనుంది. దేశంలో మొట్ట మొదటి సారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్ఐఏ ఫార్ములా ఈవరల్డ్ ఛాంపియన్ షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈరేస్ జరగనుండటం పట్ల గర్వంగా ఉందన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈరేస్ నిర్వహణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని కొనియాడారు. ఫార్ములా ఈరేస్ పట్ల ఇప్పటికే మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు ప్రభాస్. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నుంచి ఆ చుట్టుపక్కల రోడ్లు వీటి కోసమే విస్తరించారు. గచ్చిబౌలి వరకు కూడా కొంత మార్చారు. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో జరగనుంది. ఈరేస్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. బుక్ మై షోలో టికెట్స్ ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
2023 హైదరాబాద్ ఈ ప్రిక్స్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్స్ ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్స్ ధరలు రూ. 1000, రూ. 3,500, రూ. 6000, రూ. 10,000 గా నిర్ణయించారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఈరేసింగ్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం గతేడాదే ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించనున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.