AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butta Bomma Trailer: అందంగా.. ఆసక్తికరంగా బుట్టబొమ్మ ‘ట్రైలర్’.. బ్యూటీఫుల్ సస్పెన్స్ లవ్ స్టోరీ చూశారా ?..

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Butta Bomma Trailer: అందంగా.. ఆసక్తికరంగా బుట్టబొమ్మ 'ట్రైలర్'.. బ్యూటీఫుల్ సస్పెన్స్ లవ్ స్టోరీ చూశారా ?..
Butta Bomma
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2023 | 2:27 PM

Share

బాలనటిగా ఇప్పటికే దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయిన వారిలో అనిక సురేంద్రన్ ఒకరు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్, నయనతార నటించిన విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా కనిపించి మెప్పించింది అనిక. ఈ మూవీతో అటు తమిళనాడులోనే కాదు.. ఇటు తెలుగు ప్రేక్షకుల మనసులలోనూ చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్‏గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. ఆమె కథానాయికగా నటిస్తోన్న చిత్రం బుట్టబొమ్మ. ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో అనికతోపాటు.. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా..మంచి ఎంగేజింగ్ గా ఉందనే చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ సెటప్ లో నడిచే క్లీన్ లవ్ స్టోరీ.. డీసెంట్ గా ఉండగా.. ఇందులో క్యాస్టింగ్ మరింత ఆసక్తిగా కనిపించడం విశేషం. ఇక ఇందులో లవ్ స్టోరీతోపాటు.. సస్పెన్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్ కు గోపీ సుందర్ మ్యూజిక నేపథ్యానికి తగినట్లుగా ఉంది. ఇప్పటివరకు బాలనటిగా మెప్పించిన అనిక ఇప్పుడు కథానాయికగా ఎలా అలరించబోతుందో చూడాలి.

ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘బుట్టబొమ్మ’ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.