NTR30: ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నారట..!!

తారక్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

NTR30:  ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నారట..!!
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 29, 2023 | 8:37 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులంతా వేయికళ్లతో దురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన తర్వాత తారక్ ఎలాంటి సినిమాతో రాబోతున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తారక్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

ఈ మధ్యనే న్యూ ఇయ‌ర్ రోజున ఎన్టీఆర్ 30 నుంచి ఇటు ఫ్యాన్స్‌కి, అటు ఆడియెన్స్‌కి కిక్ ఇచ్చేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఏప్రిల్ 5, 2024లో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ తెచ్చేలా బాలీవుడ్ స్టార్స్ ను దింపుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుపమ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారట.

పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్ 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రాకి సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే