Hitler: హిట్లర్ మూవీలో చిరుకి సోదరిగా నటించిన ఈమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్
ఒకప్పటి నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారు.. వారు ఏం చేస్తున్నారు...? అనే వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.
హిట్లర్ సినిమా గుర్తుందా..? ఎందుకు ఉండదు లెండి. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీతో హిట్ కొట్టారు. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఓ రేంజ్‌లో పండింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇందులో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లలో ఒకరిగా నటించిన రుద్ర మీకు గుర్తు ఉందా..?. పైన ఫోటోలో ఉన్న ఆర్టిస్ట్ ఆమే. రుద్రను అశ్విని అని కూడా పిలుస్తారు. ఈ సినిమాలో ఆమెకు చాలా మంచి సీన్స్ ఉంటాయి. పెళ్లై భార్యను కోల్పోయిన వ్యక్తి.. ఒక వీక్ మూమెంట్‌లో ఆమెను చెరబడతాడు. ఆపై అతడితోనే జీవితం పంచుకుంటుంది.
మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది ఈమె. చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ పాత్రా ప్రధాన్యం ఉన్న కథల్లోనే నటించింది. రుద్ర భారతీరాజా దర్శకత్వం వహించిన పుదు నెల్లు పుదు నాతు అనే తమిళ చిత్రం ద్వారా ఆమె ఇండస్ట్రీకి రంగప్రవేశం చేసింది. ఆమె మలయాళంలో దాదాపు 16 సినిమాలు చేసింది. అక్కడ ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. తెలుగులో హిట్లర్, పెళ్లి చేసుకుందాం, పోలీసు చిత్రాల్లో మాత్రమే నటించింది. తమిళంలో చాలా సీరియల్స్‌లో నటించింది. ప్రజంట్ సింగపూర్‌లో ఉంటున్న రుద్ర.. అక్కడి సీరియల్స్‌లో నటిస్తోంది.
కాగా రుద్ర 45 ఏళ్ల వయస్సులోనూ ఆమె అదే గ్లామర్ మెయింటైన్ చేస్తుండటం గమనార్హం. ప్రజంట్ ఆమె ఫోటోలు చూసినవారు.. అరె.. కొంచెం కూడా మారలేదే అని నోరెళ్లబెడుతున్నారు. ఆ డైట్ సీక్రెట్ ఏంటో మాక్కూడా కొంచెం చెప్పొచ్చుగా అని కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram