AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ‘మద్యానికి..సిగరెట్‏లకు బానిసయ్యాను.. ఆమె నన్ను మార్చింది’.. రజినీకాంత్ ఎమోషనల్.. 

ఆయన జీవితాన్ని తన భార్య లత ఎంతో మార్చిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తలైవా. సమయం వచ్చినప్పుడల్లా తన సతీమణి గురించి ఎన్నో రకాలుగా చెబుతూ.. తనకు.. తన కుటుంబానికి ఆమె చేసిన సేవ గురించి చెబుతుంటారు.

Rajinikanth: 'మద్యానికి..సిగరెట్‏లకు బానిసయ్యాను.. ఆమె నన్ను మార్చింది'.. రజినీకాంత్ ఎమోషనల్.. 
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2023 | 3:00 PM

Share
దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ ప్రత్యేకం. తలైవా అంటూ అభిమానులంతా ముద్దుగా పిలుచుకుంటుంటారు. తెలుగులోనూ రజినీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సినిమాల ఎంపికలోనూ తలైవా గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన జీవితాన్ని తన భార్య లత ఎంతో మార్చిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తలైవా.  సమయం వచ్చినప్పుడల్లా తన సతీమణి గురించి ఎన్నో రకాలుగా చెబుతూ.. తనకు.. తన కుటుంబానికి ఆమె  చేసిన సేవ గురించి చెబుతుంటారు. తాజాగా మరోసారి తన జీవిత భాగస్వామికి కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన వేదికపై మాట్లాడుతూ తన భార్య వల్లే ఇలా క్రమశిక్షణ నేర్చుకున్నానని.. తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానంటూ చెప్పుకొచ్చారు.
“నా భార్య లతను పరిచయం చేసిన వై జీ మహేంద్రన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను కండక్టర్ గా ఉన్నప్పుడు రోజూ తాగేవాడిని… ఎన్ని సిగరెట్స్ తాగుతున్నానో కూడా లెక్కే ఉండేది కాదు. ప్రతిరోజు సిగరెట్స్ తాగేవాడిని. అలాగే రోజు నాన్ వెజ్ తినేవాడిని. కనీసం రోజుకు రెండుసార్లు నాన్ వెజ్ భోజనం చేస్తాను. ఈ మూడింటిని ఎక్కువగా తీసుకునేవారు 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరు. నిజానికి నా భార్య లత నన్ను చాలా మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను ” అని అన్నారు.
రజినీకాంత్ చివరిసారిగా దర్శకుడు సిరుత్తై శివ తెరకెక్కించిన అన్నత్తే చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సునీల్, తమన్నా, విజయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.