- Telugu News Photo Gallery Cinema photos Kannada Actors Haripriya And Vasishta Simha Wedding photos goes viral
Haripriya: పిల్ల జమీందార్ హీరోయిన్ పెళ్లి ఫొటోలు చూశారా? కొత్త దంపతులు ఎంత క్యూట్‌గా ఉన్నారో..
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ హరిప్రియ పెళ్లిపీటలెక్కింది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వీరి వివాహం వేడుకగా జరిగింది.
Updated on: Jan 27, 2023 | 1:54 PM

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ హరిప్రియ పెళ్లిపీటలెక్కింది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వీరి వివాహం వేడుకగా జరిగింది.

మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం వేదికగా జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మాత్రమే హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు.

శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, అమృత అయ్యంగార్ తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. హరిప్రియ- వశిష్ట సింహా దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు

హరిప్రియకు తెలుగు సినిమా ఇండస్ట్రీతోనూ మంచి అనుబంధం ఉంది. తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అమ్మడు.. న్యాచురల్ స్టార్ నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి

ఇక వశిష్ట సింహా విషయానికొస్తే.. కేజీఎఫ్ సిరీస్‌లతో పాటు తెలుగులో నారప్ప, నయీం డైరీస్, ఓదెల రైల్వేస్టేషన్ తదితర తెలుగు సినిమాల్లో నూ నటించాడు.

ఓ సినిమా షూటింగ్ సమయంలో హరిప్రియ- వశిష్టకు మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి. గత కొంతకాలంగా డేటింగ్‌లో మునిగితేలుతున్న వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు.





























