Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: ‘విజయ్‏తో నాకు మాటల్లేవు.. మా మధ్య గొడవలు నిజమే’.. దళపతి తండ్రి బయటపెట్టిన నిజాలు..

తన కుమారుడితో గొడవలు ఉన్నాయని.. ఇద్దరం గడిచిన ఏడాదిన్నరగా సరిగ్గా మాటల్లేవనే విషయం నిజమేనని అన్నారు. కానీ మా మధ్య వచ్చే గొడవలు అంత పెద్దవి కావని.. మేము తిరిగి కలుసుకోవడం సహజమని తెలిపారు. ప్రస్తుతం విజయ్ తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Vijay Thalapathy: 'విజయ్‏తో నాకు మాటల్లేవు.. మా మధ్య గొడవలు నిజమే'.. దళపతి తండ్రి బయటపెట్టిన నిజాలు..
Vijay Thalapathy
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 28, 2023 | 2:47 PM

ఇటీవలే వరిసు సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు తమిళ్ స్టార్ విజయ్ దళపతి. అయితే ఓవైపు హీరోగా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండే విజయ్.. తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ముఖ్యంగా దళపతికి.. ఆయన తండ్రికి మధ్య వివాదాల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. గతంలో తన తండ్రిపైనే విజయ్ ఫిర్యాదు చేయడం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు సద్దుమణిగాయని టాక్ నడిచింది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా మరోసారి తండ్రికొడుకుల మధ్య గొడవల గురించి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ వీరు మాట్లాడుకోవడం లేదని.. మనస్పర్థలు ఉన్నాయని టాక్. తాజాగా ఈ విషయాలపై స్పందిస్తూ..అసలు నిజాలు చెప్పేశారు విజయ్ తండ్రి చంద్రశేఖర్. తన కుమారుడితో గొడవలు ఉన్నాయని.. ఇద్దరం గడిచిన ఏడాదిన్నరగా సరిగ్గా మాటల్లేవనే విషయం నిజమేనని అన్నారు. కానీ మా మధ్య వచ్చే గొడవలు అంత పెద్దవి కావని.. మేము తిరిగి కలుసుకోవడం సహజమని తెలిపారు. ప్రస్తుతం విజయ్ తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

“నా కుమారుడు విజయ్ కు నేనంటే ఎంతో ఇష్టం. నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. సినిమాల తర్వాత విజయ్ కే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఆతర్వాతే నా భార్య. అయితే తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా నాకు , నా కొడుకుకు మధ్య సరిగ్గా మాటలు లేవు. మా ఇద్దరి మధ్య సంబంధం సరిగ్గా లేదు. కానీ మా దృష్టిలో అది పెద్ద విషయం కాదు. మేమిద్దరం గొడవలు పడతాం.. ఆ తర్వాత మళ్లీ కలుస్తాం. తండ్రీ కొడుకుల బంధంలో ఇలాంటి కామన్. ఇటీవల మేమంతా కలిసి వారిసు సినిమా చూశాం.” అని అన్నారు. రాజకీయ పార్టీ పరమైన విషయంలో విజయ్ కు చంద్రశేఖర్ కు మధ్య వాగ్వాదాలు జరిగాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆలిండియా విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌ను రాజకీయ పార్టీగా మార్చడానికి ప్రయత్నించినందుకు విజయ్ తన తండ్రితోపాటు మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేయాలని, తాను ప్రధాన కార్యదర్శిగా, విజయ్‌ తల్లి శోభా చంద్రశేఖర్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తనకు రాజకీయాల్లోకి చేరాలనే ఉద్దేశ్యం లేదని ఫిర్యాదు చేసిన అనంతరం ప్రకటన విడుదల చేశాడు విజయ్. తన పేరు.. స్టార్ డమ్ ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని తల్లిదండ్రులను కోరారు విజయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.