AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakesh-Sujatha: ఉంగరాలు మార్చుకున్న జబర్దస్త్‌ లవర్స్‌.. సందడి చేసిన మంత్రి రోజా, బుల్లితెర సెలబ్రిటీలు

జబర్దస్త్‌ ప్రేమ పక్షులు రాకింగ్‌ రాకేశ్‌- జోర్దార్‌ సుజాతల ఎంగేజ్‌మెంట్ వేడుకగా జరిగింది. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు శుక్రవారం ఉంగరాలు మార్చుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖా మంత్రి రోజా హాజరయ్యారు.

Rakesh-Sujatha: ఉంగరాలు మార్చుకున్న జబర్దస్త్‌ లవర్స్‌.. సందడి చేసిన మంత్రి రోజా, బుల్లితెర సెలబ్రిటీలు
Rakesh, Sujatha, Roja
Basha Shek
|

Updated on: Jan 28, 2023 | 4:51 PM

Share

జబర్దస్త్‌ ప్రేమ పక్షులు రాకింగ్‌ రాకేశ్‌- జోర్దార్‌ సుజాతల ఎంగేజ్‌మెంట్ వేడుకగా జరిగింది. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు శుక్రవారం ఉంగరాలు మార్చుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖా మంత్రి రోజా హాజరయ్యారు. అలాగే స్టార్‌ యాంకర్లు అనసూయ, రవి, గెటప్‌ శ్రీను, అదిరే అభి సహా, చలాకీ చంటి తదితర బుల్లితెర, జబర్దస్త్ సెలబ్రిటీలు పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రాకింగ్‌ రాకేశ్‌- సుజాత ల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు కంగ్రాట్స్‌ తెలుపుతున్నారు. కాగా ఇటీవలే తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారీ లవ్‌బర్డ్స్‌. ఈనెల చివర్లోనే నిశ్చితార్థం చేసుకుంటామని తెలిపారు. ఇప్పుడు అనుకున్నట్లే ఉంగరాలు మార్చుకున్నారు. కాగా నిశ్చితార్థం చేసుకునే రోజే లగ్నపత్రిక కూడా రాసుకోబోతున్నట్లు జోర్దార్ సుజాత చెప్పింది. అయితే పెళ్లి డేట్‌పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదీ ప్రేమ పక్షులు.

ఇక టీవీ యాంకర్‌గా పరిచయమైన సుజాత బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టింది. ప్రముఖ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ టీంతో కలిసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈక్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. పలు సందర్భాల్లో జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశారు. ఇక పెద్దల అనుమతి కూడా లభించడంతో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీరు త్వరలోనే తమ పెళ్లి డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎనిమిదేళ్ల యూపీఎస్సీ కల చెదిరింది.. రూ. 18,000లకు ఉద్యోగంలో చేరిన
ఎనిమిదేళ్ల యూపీఎస్సీ కల చెదిరింది.. రూ. 18,000లకు ఉద్యోగంలో చేరిన
భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా
భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా
ప్రేమించుకున్నారు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.. కట్‌చేస్తే..
ప్రేమించుకున్నారు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.. కట్‌చేస్తే..
పూజ సమయంలో ఈ తప్పు చేస్తే ఫలితం దక్కదట.. నిలబడి పూజపై శాస్త్ర..
పూజ సమయంలో ఈ తప్పు చేస్తే ఫలితం దక్కదట.. నిలబడి పూజపై శాస్త్ర..
టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు
టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు
రైలు ప్రయాణంలో ఈ పొరపాటు అస్సలు చేయకండి.. లేకుంటే జైలుపాలే..!
రైలు ప్రయాణంలో ఈ పొరపాటు అస్సలు చేయకండి.. లేకుంటే జైలుపాలే..!
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
రెండో పెళ్లికి హార్దిక్ పాండ్యా రెడీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
రెండో పెళ్లికి హార్దిక్ పాండ్యా రెడీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
గురు, శుక్రులు కలయిక.. ఈ రాశుల వారికి అదృష్ట దేవత కటాక్షం..!
గురు, శుక్రులు కలయిక.. ఈ రాశుల వారికి అదృష్ట దేవత కటాక్షం..!
లైఫ్ అంటే వీరిదే.. నాలుగు రాజయోగాలతో ఐదు రాశుల వారికి లక్కే లక్కు
లైఫ్ అంటే వీరిదే.. నాలుగు రాజయోగాలతో ఐదు రాశుల వారికి లక్కే లక్కు