Telugu News Entertainment Tollywood Actress Haripriya ties the Knot with Vasishta Simha in Mysore Ganapathi Sachidananda Ashram Photos goes viral Telugu Cinema News
Haripriya: కేజీఎఫ్ విలన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన పిల్ల జమీందార్ హీరోయిన్.. సందడి చేసిన సినీ తారలు
హరిప్రియకు తెలుగు సినిమా ఇండస్ట్రీతోనూ మంచి అనుబంధం ఉంది. తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అమ్మడు.. న్యాచురల్ స్టార్ నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ హరిప్రియ పెళ్లిపీటలెక్కింది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వశిష్ట సింహాతో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారీ లవ్ బర్డ్స్. శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, అమృత అయ్యంగార్ తదితర సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. హరిప్రియ- వశిష్ట సింహా దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా హరిప్రియకు తెలుగు సినిమా ఇండస్ట్రీతోనూ మంచి అనుబంధం ఉంది. తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. న్యాచురల్ స్టార్ నాని సరసన పిల్ల జమిందార్ సినిమాలో నటించింది. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలయ్యతో జై సింహ, వరుణ్ సందేశ్‌తో ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక కన్నడలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది.
ఇక వశిష్ట సింహా విషయానికొస్తే.. కేజీఎఫ్ సిరీస్‌లతో పాటు తెలుగులో నారప్ప, నయీం డైరీస్, ఓదెల రైల్వేస్టేషన్ తదితర తెలుగు సినిమాల్లో నూ నటించాడు. కాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి. గత కొంతకాలంగా డేటింగ్‌లో మునిగితేలుతున్న వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు. కాగా పెళ్లి తర్వాత బెంగుళూరులో వశిష్ఠ సింహా, హరిప్రియ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ రిసెప్షన్‌కు రానున్నట్లు తెలుస్తోంది.