AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్నది ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు.. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఎవరో గుర్తుపట్టారా మరి?

ఇందులో మెగాస్టార్‌తో ఉన్నది ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన వీరు ఆ తర్వాత స్టార్‌ డైరెక్టర్లుగా మారిపోయారు. ఇందులో ఒకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్‌ డైరెక్టర్‌గా రాణిస్తుంటే.. మరొకరు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు.

ఈ ఫొటోలో మెగాస్టార్‌తో ఉన్నది ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు.. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Jan 26, 2023 | 12:38 PM

Share

తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్‌ చిరంజీవి ఒక డిక్షనరీ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్టార్‌ హీరోగా ఎదిగిన ఆయనను ఎంతోమంది ఆరాధిస్తుంటారు. కాగా సినిమా కష్టాలను స్వయంగా చూసిన మెగాస్టార్‌ తనతో పాటు మరెందరికో చేయూతనిచ్చారు. నటులుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా.. ఇలా ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తోన్న ఎంతోమంది చిరంజీవి చేయూతతో పైకి వచ్చిన వారే. మనం చూస్తున్న పై ఫొటో కూడా ఈ కోవకు చెందినదే. ఇందులో మెగాస్టార్‌తో ఉన్నది ఇద్దరు స్టార్‌ డైరెక్టర్లు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన వీరు ఆ తర్వాత స్టార్‌ డైరెక్టర్లుగా మారిపోయారు. ఇందులో ఒకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్‌ డైరెక్టర్‌గా రాణిస్తుంటే.. మరొకరు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. మెగాస్టార్‌తో పాటు రవితేజ, మహేశ్‌బాబు, సూర్య, రజనీకాంత్‌, విజయ్‌ తదితర స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన అనుభవం వీరి సొంతం. ప్రస్తుతం స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ స్టార్‌ డైరెక్టర్లు మరెవరో కాదు గోపీచంద్‌ మలినేని, ఆర్‌. మురగదాస్‌.

మెగాస్టార్‌ చిరంజీవి హిట్ సినిమాల్లో స్టాలిన్‌ ఒకటి. మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు మురగదాస్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. పై ఫొటో కూడా స్టాలిన్‌ షూటింగ్‌ సమయంలోనిదే. ఆ సమయంలో గోపీచంద్‌ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. అప్పుడే గోపీచంద్‌ పనితీరును దగ్గరుండి చూశారు చిరంజీవి. గోపీచంద్ పుట్టినరోజున ఒక వాచ్ తెప్పించి బహుమతిగా ఇచ్చి.. నీ టైం బాగుంటుందని చెప్పి వెన్నంటి ప్రోత్సహించారు. భవిష్యత్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదుగుదావని జోస్యం చెప్పారు. ఇప్పుడదే నిజమైంది. చిరంజీవి ఇచ్చిన స్పూర్తితో ముందుకెళ్లిన గోపీచంద్‌ కంత్రి, బిల్లా సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రవితేజ డాన్‌శీను సినిమాతో డైరెక్టర్‌గా అవతారమెత్తారు. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, క్రాక్, వీర సింహారెడ్డి ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ స్టార్‌ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు. ఇక మురగదాస్‌ కూడా కోలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే