Saindhav: వెంకటేష్ పాన్ ఇండియా సినిమాకు భారీ ప్లాన్.. కీలకపాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. ఎవరంటే..
ఇప్పటికే టైటిల్ పోస్టర్, గ్లింప్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.

హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన 75వ చిత్రం కోసం సిద్ధమయ్యారు. ఇటీవలే హిట్ 2 సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శైలేషన్ కొలను వెంకీ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌లను అందించిన స్టార్, దర్శకుడు, నిర్మాత నుంచి దేశవ్యాప్తంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా వున్నాయి. ఇప్పటికే టైటిల్ పోస్టర్, గ్లింప్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపించిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తిక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రంలో బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అతను మరెవరో కాదు.. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సైంధవ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయనను ఆహ్వానిస్తూ డైరెక్టర్ శైలేష్ తో ఉన్న ఫోటో షేర్ చేశారు మేకర్స్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈరోజు సైంధవ్ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడకకు నాగ చైతన్య, రానా దగ్గుబాటి, నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ శైలేష్, నవాజుద్దీన్ హాజరయ్యారు.




త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు. గ్లింప్స్ వీడియోకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇది వెంకటేష్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ‘సైంధవ్’ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.
Super excited to have one of the best actors we have in the country @Nawazuddin_S. It’s gonna be madness I can assure you. @VenkyMama @NiharikaEnt @vboyanapalli @Music_Santhosh @maniDop @Garrybh88 @artkolla #Saindhav #venky75 pic.twitter.com/jJqZOiNNMo
— Sailesh Kolanu (@KolanuSailesh) January 26, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.