RRR Movie: నాటు నాటు పాట లిరిక్స్ పై ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబోస్.. బాల్యం జ్ఞాపకాలు..

ఈ పాటను.. తన గ్రామం.. బాల్యం.. కుటుంబ నేపథ్యానికి సంబంధించిదని తెలిపారు. తన మనసులోని భావాలకు.. చిన్ననాటి జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చానని అన్నారు.

RRR Movie: నాటు నాటు పాట లిరిక్స్ పై ఆసక్తికర విషయాలు చెప్పిన చంద్రబోస్.. బాల్యం జ్ఞాపకాలు..
Chandrabose
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 25, 2023 | 5:25 PM

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్‏కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు చోటు దక్కడంపై సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి అందించగా.. రచయిత చంద్రబోస్ లిరిక్స్ రాశారు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై సంతోషంగా ఉందన్నారు గేయ రచయిత చంద్రబోస్. ఈ పాటను.. తన గ్రామం.. బాల్యం.. కుటుంబ నేపథ్యానికి సంబంధించిదని తెలిపారు. తన మనసులోని భావాలకు.. చిన్ననాటి జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చానని అన్నారు.

“నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కీరవాణి సర్, రాజమౌళి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి.. సామాన్య నేపథ్యం ఉన్న నాలాంటి రచయితకు ఇది గొప్ప విజయం. ఇక నాటు నాటు పాట రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో రాసిన ప్రతి పదమూ.. నా బాల్యం, నా గ్రామం, నా కుటుంబానికి సంబంధించినదే. నా మనసులోని భావాలకు.. జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చాను ” అంటూ చెప్పుకొచ్చారు.

ఆస్కార్ నామినేషన్ గురించి మాట్లాడుతూ.. ” ఇది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఒరిజినల్ కేటగిరిలో 15 పాటలు ఉన్నాయి. అందులో నాటు నాటు ఒకటి. అవతార్ సినిమా.. నాటు నాటు పాటల మధ్య పోటీ ఉందని నేను అనుకున్నాను.. కానీ అవతార్ చిత్రంలోని పాట రాలేదు. నాటు నాటు సాంగ్ టాప్ 5లో ఉంది. ” అన్నారు. 95వ ఆస్కార్ అవార్డ్ వేడుకలు మార్చి 12న జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం