AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైవ్‌ మ్యాచ్‌లో ‘సారా.. సారా’ అంటూ గిల్‌ను ఆట పట్టించిన ఫ్యాన్స్‌.. విరాట్ కోహ్లీ రియాక్షన్‌ ఏంటో చూశారా?

క్రికెట్‌ సంగతి పక్కన పెడితే అప్పుడప్పుడూ డేటింగ్‌, రిలేషన్‌షిప్‌ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు గిల్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో అతను డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

లైవ్‌ మ్యాచ్‌లో 'సారా.. సారా' అంటూ గిల్‌ను ఆట పట్టించిన ఫ్యాన్స్‌.. విరాట్ కోహ్లీ రియాక్షన్‌ ఏంటో చూశారా?
Virat Kohli, Shubman Gill
Basha Shek
|

Updated on: Jan 26, 2023 | 1:35 PM

Share

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధించింది. ఈ మొత్తం సిరీస్‌లో 2 సెంచరీలతో సహా మొత్తం 360 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన గిల్ ఇండోర్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. కాగా క్రికెట్‌ సంగతి పక్కన పెడితే అప్పుడప్పుడూ డేటింగ్‌, రిలేషన్‌షిప్‌ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు గిల్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో అతను డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే సమయంలో బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌తో కలిసి పలు సందర్భా్ల్లో మీడియా కంట పట్టాడీ యంగ్ బ్యాటర్‌. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్‌తో సిరీస్‌లో గిల్‌ పేరు ఎంత మారు మ్రోగిందో.. సారా పేరు కూడా అంతే ట్రెండింగ్ అయ్యింది . హైదరాబాద్‌లో జరిగిన మొదటి వన్డేలో గిల్​ ఫీల్డింగ్​చేస్తుండగా.. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్​ఒక్కసారిగా ‘సారా.. సారా’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ సారా సచిన్​ కుమర్తె సారా తెండూల్కరా లేక సారా అలీ ఖానా అన్న విషయం మాత్రం తెలియదు. ఇక ఇండోర్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలోనూ సారా సారా స్లోగన్స్‌ గట్టిగా వినిపించాయి.

‘సారా బాభీ.. సారా బాభీ’ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇండోర్‌ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇదే సమయంలో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్ కోహ్లీ ఈ క్షణాలను ఎంజాయ్‌ చేశాడు. ఫ్యాన్స్‌ను చూస్తూ చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గిల్‌- సారాల డేటింగ్‌ వ్యవహారంపై ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గిల్‌- సారాల పేర్లు మాత్రం బాగా హైలైట్‌ అవుతున్నాయి. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా పొట్టి ఫార్మాట్లో పోటీపడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం (జనవరి 27) రాంచీ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ