Waltair Veerayya: డిజిటల్‌ ప్రీమియర్‌కు వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?

థియేటర్లలో కలెక్షన్ల వర్షం కొనసాగుతుండగానే వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌కు డేట్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Waltair Veerayya: డిజిటల్‌ ప్రీమియర్‌కు వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?
Chiranjeevi, Raviteja
Follow us
Basha Shek

|

Updated on: Jan 26, 2023 | 9:59 AM

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఊచకోత ఆగడం లేదు. కే.ఎస్‌.రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్‌ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసింది. సంక్రాంతి సీజన్‌ ముగిసినా, కొత్త సినిమాలు రిలీజవుతున్నా వాల్తేరు వీరయ్య థియేటర్ల వద్ద మాత్రం ఇంకా కోలహలం, సందడి కనిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కొనసాగుతుండగానే వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్‌కు డేట్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య డిజిటల్‌ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మెగాస్టార్‌ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ ఇదే డేట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది.

ఇక ఓవర్సీస్‌లోనూ రికార్డులు కొల్లగొడుతోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటివరకు 2.25 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా మైత్రి మూవీ మేకర్స్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమా భారీ విజయం సాధించడానికి రవితేజ కూడా ఒక కారణం. మెగాస్టార్‌- మాస్‌ మహారాజా కాంబినేషన్‌లో వచ్చిన సీన్లు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ఇక శ్రుతిహాసన్‌ అంద చందాలు, క్యాథరిన్‌ థెరిస్సా అభినయం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ ఛార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి