AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ ఫన్.. ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే బ్లాక్‌బస్టర్ చిత్రాలివే!

ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు బ్లాక్‌బస్టర్ మూవీస్ సిద్దంగా ఉన్నాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు..

OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ ఫన్.. ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే బ్లాక్‌బస్టర్ చిత్రాలివే!
Ott Release Date
Ravi Kiran
|

Updated on: Jan 26, 2023 | 6:55 PM

Share

ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు బ్లాక్‌బస్టర్ మూవీస్ సిద్దంగా ఉన్నాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు.. కొన్ని 4 వారాలకు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తే.. మరికొన్ని 8 వారాలకు రిలీజ్ అవుతాయి. అయితే వచ్చే నెలలో మాత్రం సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వస్తాయని తెలుస్తోంది. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో.? ఇప్పుడు తెలుసుకుందామా.?

  • బ్లాక్ పాంథర్(వఖండా ఫరెవర్):

బ్లాక్ పాంథర్ సిరీస్ నుంచి వచ్చిన రీసెంట్ చిత్రం ‘వఖండా ఫరెవర్’. ఈ సినిమా 2022, నవంబర్ 11న విడుదలై.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఫిబ్రవరి 1 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండనుంది.

  • వరిసు:

దళపతి విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వరిసు’. ఈ చిత్రం తమిళంలో జనవరి 11న.. తెలుగులో జనవరి 14న విడుదలైంది. రెండు భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. థియేటర్ల సందడి చేసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
  • తునివు:

అజిత్ కుమార్, మంజు వారియర్ జంటగా దర్శకుడు హెచ్. వినోత్ రూపొందించిన చిత్రం ‘తునివు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

వీటితో పాటు చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా.. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘వీరసింహరెడ్డి’ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి మూడో వారం నుంచి స్ట్రీమింగ్ అవుతాయని తెలుస్తోంది. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రావాల్సి ఉంది. ఒకవేళ ఈ చిత్రాలకు వచ్చే నెలలో డేట్స్ కన్ఫర్మ్ అయితే.. ఫ్యాన్స్‌కు మాస్ జాతరేనని చెప్పాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్