Siddharth-Aditi: శర్వా ఎంగేజ్‌మెంట్‌కు జంటగా వచ్చిన సిద్ధార్థ్‌- అదితి.. డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చినట్టేనా?

సిద్ధార్థ్‌, అదితి ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలు, టూర్లు, వెకేషన్లకు జంటగా వెళ్లడం, సినిమా ఈవెంట్స్‌కు కలిసి హాజరవుతుండడంతో తరచూ ఈ జోడీ వార్తల్లో నిలుస్తోంది.

Siddharth-Aditi: శర్వా ఎంగేజ్‌మెంట్‌కు జంటగా వచ్చిన సిద్ధార్థ్‌- అదితి.. డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చినట్టేనా?
Siddharth, Aditi, Sharwanand
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2023 | 6:43 AM

టాలీవుడ్ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి- సురేఖ దంపతులు, రామ్‌చరణ్‌- ఉపాసన, నాగార్జున-అమల, అక్కినేని అఖిల్‌ తదితర టాలీవుడ్‌ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకకు హాజరైన వారిలో ఓ జోడి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. వారే సిద్ధార్థ్‌- అదితి రావ్‌ హైదరీ. శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు జంటగా వచ్చిన వీరు కాబోయే దంపతులను అభినందించారు. కాగా సిద్ధార్థ్‌, అదితి ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలు, టూర్లు, వెకేషన్లకు జంటగా వెళ్లడం, సినిమా ఈవెంట్స్‌కు కలిసి హాజరవుతుండడంతో తరచూ ఈ జోడీ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇంత వరకు తమ డేటింగ్‌ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదీ లవ్‌ బర్డ్స్‌.

ఇక గతంలో కూడా అదితి పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో సన్నిహితంగా ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘హ్యాపీ హ్యాపీ హ్యాపీబర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అంటూ ప్రేమ కురిపించాడు. అలా తరచూ డేటింగ్‌ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తున్న వీరు తాజాగా శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు కూడా జంటగానే హాజరయ్యారు. శర్వానంద్‌- రక్షితల జంటతో సిద్ధార్థ్‌- అదితి జంట దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోసారి జంటగా ఫొటోలకు ఫోజులు ఇవ్వగానే రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే వీళ్లు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అంటూ నెటిజన్స్ చెవులు కొరుక్కంటున్నారు. కాగా సిద్ధార్థ్‌, శర్వానంద్‌, అదితి మహాసముద్రం సినిమాలో కలిసి పనిచేశారు. దీనికి తోడు సినిమా ఇండస్ట్రీలో సిద్ధార్థ్‌, శర్వానంద్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు