Vishnu Priya: స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత

ప్రముఖ బుల్లితెర నటి, స్టార్‌ యాంకర్‌ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియానే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపింది.

Vishnu Priya: స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత
Tv Actress Vishnu Priya
Follow us
Basha Shek

|

Updated on: Jan 27, 2023 | 9:42 AM

ప్రముఖ బుల్లితెర నటి, స్టార్‌ యాంకర్‌ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ .. ‘మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నేను తుది శ్వాస విడిచే వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం.. నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నువ్వు ఎన్ని ఇక్కట్లు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..’ అంటూ ఎమోషనలైంది విష్ణుప్రియ. కాగా ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించిన విష్ణుప్రియ పోవే పోరా షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామానూ ఎవరూ మర్చిపోలేరు. పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలోలో ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

స్నేహితుల ఇంట విషాద ఛాయలు..

కాగా విష్ణుప్రియ- జబర్దస్త్ రీతూ చౌదరి బుల్లితెర ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్రెండ్స్‌ అని అందరికి తెలుసు. వారిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ తెలుసు. ఇటీవలే మాల్దీవులకు కలిసి వెకేషన్‌కు కూడా వెళ్లారు. అయితే ఇటీవలే రీతూ చౌదరి తండ్రి హఠాన్మరణం చెందారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు తన స్నేహితురాలు విష్ణు ప్రియ మాతృమూర్తి కాలం చేశారు. ఇలా రోజుల వ్యవధిలోనే ఇద్దరు మిత్రుల ఇంట తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. కాగా విష్ణుప్రియకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సానుభూతి తెలుపుతున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు