Tarakaratna: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తారకరత్న దగ్గరి బంధువు.. వీరిద్దరి మధ్య సంబంధమేంటంటే..
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తారకరత్న దగ్గరి బంధువులవుతారట. విజయసాయిరెడ్డి సతీమణి సొంత చెల్లెలి కూతురినే తారకరత్న వివాహం చేసుకున్నారు. అంటే విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారన్న మాట.
టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రముఖ సినీనటుడు తారకరత్న తీవ్ర గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నారాయాణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తారకరత్నకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అదేంటంటే.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తారకరత్న దగ్గరి బంధువులవుతారట. విజయసాయిరెడ్డి సతీమణి సొంత చెల్లెలి కూతురినే తారకరత్న వివాహం చేసుకున్నారు. అంటే విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారన్న మాట. విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కూతురు అలేఖ్యా రెడ్డి. ఈమె టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. అందులో భాగంగా తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారామె. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రముఖ దేవాలయం సంఘీ టెంపుల్‌లో తారకరత్న- అలేఖ్యల వివాహం జరిగింది. ఈ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
అలా అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల విజయసాయిరెడ్డి- తారకరత్న మధ్య మామ అల్లుళ్ల అనుబంధం ఏర్పడిందట. కాగా తారక రత్న, విజయ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి పలుమార్లు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ విషయంపై ఒకానొక సందర్భంలో స్పందించిన తారకరత్న.. ‘రాజకీయాలు వేరు.. కుటుంబం వేరు. నేను ఎప్పటీకీ టీడీపీలోనే ఉంటాను’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా, శుక్రవారం మొదలైన లోకేష్ యాత్రకు మద్దతు తెలపటానికి నందమూరి తారకరత్న కుప్పం వెళ్లారు. ఈ సందర్భంగానే ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడీ హీరో. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు చేసి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తేల్చారు. అయితే పరిస్థితిలో మార్పు రావడంతో బెంగళూరకు తరలించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..