Guru Mahadasha: వారికి 16 ఏళ్లపాటు గురు మహర్దశ.. వద్దన్నా అదృష్టం వరిస్తుందట.. పట్టిందల్లా బంగారమే..

బృహస్పతి మహాదశ కూడా ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది.

Guru Mahadasha: వారికి 16 ఏళ్లపాటు గురు మహర్దశ.. వద్దన్నా అదృష్టం వరిస్తుందట.. పట్టిందల్లా బంగారమే..
Guru Mahadasha
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 12:16 PM

అందరూ అదృష్ట, దురదృష్టాల గురించి మాట్లాడుతారు. ఒక వ్యక్తి జీవితంలో అదృష్టం ఉంటే అతనికి సమాజంలో గౌరవం, సంపద, సుఖ సంతోషాలు లభిస్తాయి. అదే సమయంలో ఎవరి జీవితంలోనైనా దురదృష్టాల ఛాయలు అలుముకుంటే.. చాలా కష్టాలను, నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రంలో.. వ్యక్తి విజయం, వైఫల్యం వెనుక గ్రహాలు, నక్షత్రరాశులు ప్రత్యేక పాత్రను కలిగి ఉంటాయని పేర్కొంది. గ్రహాల గమనం మారినప్పుడు లేదా ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు, వ్యక్తి జీవితంలో శుభ, అశుభ ప్రభావాలు రెండూ చోటుచేసుకుంటాయి. వేద జ్యోతిషశాస్త్రంలో.. మొత్తం 9 గ్రహాలు ఒక వ్యక్తి జీవితంపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తాయి. ఈ రోజు మనం దేవగురు బృహస్పతి ఒక వ్యక్తి జీవితంలో అదృష్టం, దురదృష్టంను ఎలా విధంగా ప్రభావితం చేస్తాడో తెలుసుకుందాం..

ఒక వ్యక్తి జాతకంలో గురు మంచి స్థానంలో ఉన్నప్పుడు..  ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖ , సంపదలు పొందుతారు. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి విద్య, సంపద, మతం-ఆధ్యాత్మికత, దాతృత్వం, సంతానం కారకంగా పరిగణించబడుతుంది. బృహస్పతి మహాదశ కూడా ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది.

జాతకంలో బృహస్పతి ప్రభావం  అన్ని గ్రహాల్లో గురుడు శుభ ఫలితాలను ఇచ్చేవాడిగా భావిస్తారు. బృహస్పతి తన స్థానాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి  మార్చుకోవడానికి దాదాపు 13 నెలలు పడుతుంది. బృహస్పతి మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. బృహస్పతి ధనుస్సు, మీన రాశులకు అధిపతి. ఏ వ్యక్తి జాతకంలో గురువు శుభ స్థానంలో ఉంటాడో.. ఆ వ్యక్తి తన జీవితంలోని అన్ని రంగాల్లో శుభాలను, మంచి ఫలితాలను పొందుతాడు. జాతకంలో బృహస్పతి అనుకూల స్థానం.. శుభ గ్రహాల కలయిక కారణంగా, వ్యక్తికి అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. బృహస్పతి శుభ ఫలితాలను ఇచ్చినప్పుడు..ఆ వ్యక్తి విద్య,  వ్యాపార రంగాల్లో మంచి విజయాన్ని సాధిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో మంచి గౌరవం, డబ్బు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తి జీవితంలో బృహస్పతి మహాదశ ప్రారంభమైనప్పుడు.. అతను అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు. సమాజంలో కీర్తి, గౌరవం, అన్ని రకాల భౌతిక ఆనందాలు లభిస్తాయి. గురువు అనుగ్రహంతో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాడు. ఎవరి జాతకంలో బృహస్పతి  శుభ దృష్టిని కలిగి ఉంటాడో.. వారికి సంతాన సౌభాగ్యం, విద్యలో పురోభివృద్ధి, సంపదలు లభిస్తాయి.

జాతకంలో బృహస్పతి దుష్ప్రభావం ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి  చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. బృహస్పతి అశుభ ఫలితాలు ఇస్తే గ్యాస్, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయాలో తెలుసుకోండి వేద గ్రంధాల ప్రకారం బృహస్పతి దేవ గురువుగా భావించి పూజించాడు. వారంలో గురువారం గురువుకు అంకితం చేయబడింది.  గురువు అనుగ్రహం కోసం గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. గురువుకి ఇష్టమైన రంగు పసుపు.. అంతేకాదు అరటి చెట్టులో ఉంటాడని విశ్వాసం. ఎవరి జాతకంలో గురుడు స్తానం బలంగా ఉండదో.. వారు బలోపేతం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి.

గురువారం ఉపవాసం ఉండాలి. పసుపు బట్టలుధరించి.. నైవేద్యంగా మిఠాయిలు సమర్పించాలి. విష్ణువును పూజించండి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బృహస్పతి స్దాన బలోపేతం కోసం  పుష్యరాగాన్ని రాయిని ధరించడం శ్రేయస్కరం. గురువును బలపరచడానికి..  స్నానపు నీటిలో పసుపు వేసుకోండి. అరటి చెట్టును పూజించడం శ్రేయస్కరం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!