Guru Chandal Yoga: 2023లో గురు చండాల యోగం.. ఈ రాశివారికి అన్నీ కష్టాలు, నష్టాలే.. ఎన్నినెలలంటే
శని తర్వాత ఇప్పుడు గురుడు ఏప్రిల్ 22న రాశిని మార్చుకోనున్నాడు. బృహస్పతి మేషరాశిలో సంచరించే సమయంలో గురు-చండాల యోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గురు-చండాల యోగం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు వివిధ శుభ , అశుభ యోగాలు ఏర్పడతాయి. తొమ్మిది గ్రహాల్లో ఒకటైన చంద్రుడు తన రాశిని రెండున్నర రోజుల్లో మార్చుకుంటాడు. శని రెండున్నర సంవత్సరాల తర్వాత తన రాశిని మార్చుకుంటాడు. 30 ఏళ్ల తర్వాత 2023లో శని గ్రహం జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించింది. శని తర్వాత ఇప్పుడు గురుడు ఏప్రిల్ 22న రాశిని మార్చుకోనున్నాడు. బృహస్పతి మేషరాశిలో సంచరించే సమయంలో గురు-చండాల యోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గురు-చండాల యోగం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. బృహస్పతి, రాహువు ఒకే రాశిలో కలిసినప్పుడు.. ఈ గురు-చండాల యోగం ఏర్పడుతుంది.
గురు చండాల యోగం గురు-చండాల యోగం 22 ఏప్రిల్ 2023న ఏర్పడుతుంది. ఏదైనా ఒక రాశిలో గురు, రాహువు కలిసి ఉన్నప్పుడు గురు-చండాల యోగం ఏర్పడుతుంది. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సమయంలో రాహువు మేషరాశిలో ఉండగా.. ఏప్రిల్ 22 న, గురువు తన స్వంత రాశి అయిన మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. 13 నెలలు ఉండనున్నాడు.ఇప్పటికే మేషరాశిలో రాహువు ఉండటం వల్ల గురు-రాహువు కలయిక గురు-చండాల యోగాన్ని సృష్టిస్తుంది. ఈ గురు.. రాహువుల కలయిక 6 నెలలు ఉంటుంది. 30 అక్టోబర్ 2023న రాహువు మేషరాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించిన అనంతరం.. ఈ కలయిక ముగుస్తుంది. గురు-చండాల యోగం దోషాలను కలిగిస్తుంది. ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడిందో.. వారికీ రానున్న సమయం కష్టాలతో నిండి ఉంటుంది.
గురు-చండల యోగ ప్రభావం ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి శుభ గ్రహంగా పరిగణించబడుతుంది.. అదే సమయంలో రాహువును దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. గురు-రాహువుల కలయికతో ఏర్పడిన గురు-చండాల యోగం చాలా అశుభం. రాహువు నీడ గురువుపై పడినప్పుడు.. గురువు సానుకూల ప్రభావం స్థానికులపై పడదు.. ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎవరి జాతకంలోనైనా గురు-చండాల యోగ ప్రభావం ఉన్నప్పుడు, అతని జీవితంలో కష్టాలు మొదలవుతాయి. అంతేకాదు మనిషి మనసులో చెడు ఆలోచనలు కలుగుతాయి. ఈ యోగ ప్రభావంతో విద్యారంగంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం, డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ధన నష్టం కలుగుతుంది. వివాదాలు పెరుగుతాయి. గురు-చండాల యోగం వల్ల మనిషి జీవితంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)