Magha Purnima: నేడు రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో సహా 4 శుభ యోగాలు.. ఈ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

మాఘ పూర్ణిమ ఆదివారం రాత్రి 11:58 గంటలకు ముగుస్తుంది. ఈరోజు రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో సహా నాలుగు శుభ యోగాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చేసే స్నానం, పూజలు, మంత్రాలు పఠించడం, దానధర్మాలు అత్యంత ఫలవంతమని..  పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.

Magha Purnima: నేడు రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో సహా 4 శుభ యోగాలు.. ఈ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..
Magha Purnima 2023
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 7:30 AM

మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని.. మాఘ పూర్ణిమగా భక్తులు జరుపుకుంటున్నారు. బ్రహ్మా ముహుర్తం సమయంలో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి సూర్యభగవానుడికి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఈ పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు. పిల్లల సుఖ సంతోషాల కోసం చాలామంది పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 04 శనివారం రాత్రి 09:29 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు అంటే ఆదివారం రాత్రి 11:58 గంటలకు ముగుస్తుంది. ఈరోజు రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగంతో సహా నాలుగు శుభ యోగాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చేసే స్నానం, పూజలు, మంత్రాలు పఠించడం, దానధర్మాలు అత్యంత ఫలవంతమని..  పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం. దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

జ్యోతిష్యం ప్రకారం.. లక్ష్మిదేవి, చంద్రుని ఆశీస్సులతో అదృష్టం వెల్లివిరుస్తుంది. సంపదను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. లక్ష్మీ దేవికి ఎనిమిది రూపాలు ఉన్నాయి.. ఈ రూపాలను అష్టలక్ష్మి అని పిలుస్తారు. అష్టలక్ష్మి అనుగ్రహం పొందిన వ్యక్తి,  పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు. అదే సమయంలో లక్ష్మీ దేవి ఆగ్రహిస్తే..  ఆ వ్యక్తి  సంపద, కీర్తి, ఐశ్వర్యం అన్నీ శూన్యం. మాఘ పూర్ణిమ రోజున అష్టలక్ష్మీదేవి ఆగ్రహం పొందకుండా ఉండడానికి కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఈరోజు ఎవరైనా పొరపాటున వీటిని చేస్తే.. లక్ష్మీ దేవి ఆగ్రహంతో ఇబ్బందులు తలెత్తుతాయి.

మాఘ పూర్ణిమ రోజున ఏమి చేయకూడదంటే.. 

ఇవి కూడా చదవండి
  1. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ మూర్తంలోనే నిద్రలేచి స్నానం చేసి.. విష్ణుమూర్తిని ధ్యానించి దానధర్మాలు చేయాలి. సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం వలన దురదృష్టం వెంటాడుతుంది.
  2. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయకపోవడం విష్ణవు, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. గంగాస్నానం లేదా నదీ స్నానం  చేసే వీలులేనట్లు అయితే.. కానీ ఇంట్లో గంగాజలం చేర్చిన నీటితో స్నానం చేయండి. పవిత్ర గంగ కలిపిన నీటితో స్నానం పవిత్రం అని నమ్మకం.
  3. విష్ణువును ప్రసన్నం చేసుకోవడం ఎంత ముఖ్యమో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కనుక మాఘ పూర్ణిమ రోజున విష్ణు భగవానుని లేదా అతనికి సంబంధించిన వస్తువులను అగౌరవపరచే విధమైన పనులు చేయవద్దు. విష్ణువుని తూలనాడితే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయినట్లే..
  4. మాఘ పూర్ణిమ రోజున అరటి మొక్క, తులసి మొక్క, ఉసిరి చెట్టు, రావి, పారిజాతం మొదలైన వాటిని రక్షించండి.. ఈ మొక్కలు హిందూ సనాతన ధర్మంలో విశిష్ట స్థానాన్ని కలిగివున్నాయి. అంతేకాదు విష్ణువు, లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉన్నాయి.
  5. మాఘ పూర్ణిమ లేదా మరే ఇతర రోజున ఆవును చంపవద్దు లేదా ఆవును హింసకు గురి చేయవద్దు. ఆవును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, దేవతలు, దేవతలు అందరూ ఆవులో కొలువై ఉంటారని విశ్వాసం. మాఘ పౌర్ణమి రోజున గోవులకు సేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
  6. నేడు మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన తామసిక ఆహారానికి దూరంగా ఉండండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!