Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magha Purnima: వైభవంగా శ్రీశైల, ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ.. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

మాఘ పౌర్ణమి సందర్భంగా పవిత్ర క్షేత్రాల్లో భక్తులు బారులు తీరారు. మాఘ పౌర్ణిమని పురష్కరించుకుంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన శ్రీశైలం, ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తున్నారు. 

Magha Purnima: వైభవంగా శ్రీశైల, ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ.. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
Giri Pradakshina
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 9:19 AM

ఈ ఏడాది పవిత్ర పౌర్ణమి మాఘమాసం ఆదివారం రావడంతో మరింత విశిష్టతను  సంతరించుకుంది. మాఘ పౌర్ణిమ స్నానాల కోసం పవిత్ర నది తీరాల్లో భక్తులు పోటెత్తారు. మరోవైపు పవిత్ర క్షేత్రాల్లో భక్తులు బారులు తీరారు. మాఘ పౌర్ణిమని పురష్కరించుకుంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన శ్రీశైలం, ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మాఘమాసం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేపట్టారు. ధర్మ ప్రచార రథంతో శ్రీశైలంలో మొదటిసారిగా ఆలయ సిబ్బంది గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ గంగాధర మండపం నుంచి అంకాలమ్మ ఆలయం, నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు సాగనుంది. మల్లన్న ఆలయంలోని పురాతన మండపాలు, ఆలయాలను సందర్శించే వీలుగా గిరి ప్రదక్షిణను ఏర్పాట్లు చేశారు.

మరోవైపు మాఘ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ చేపట్టారు.  సుమారు 8 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సాగనుంది. శ్రీ కామధేను అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ నుండి గిరి ప్రదక్షణ ప్రారంభం అయ్యి.. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితార, కబెల, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్త పేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి నుండి మహామండపం వరకు సాగనుంది. అంతేకాదు.. ఇక నుంచి ప్రతినెలా పౌర్ణమికి ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చెయ్యాలని వైదిక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కొరకు హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఆలయ వైదిక కమిటీ, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…