Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Week: నేడు రోజ్ డే.. ఈ రాశుల వారికి ప్రేమ జీవితం అద్భుతం.. ఆ క్రేజీ లవర్స్ ఎవరంటే..

కొన్ని రాశుల వారు తమ భాగస్వామిని తల్లిదండ్రులకు పరిచయం చేయాలని ఆలోచించ వచ్చు. ప్రేమని పెళ్లి వరకూ తీసుకుని వెళ్లాలని భావించవచ్చు. ఈ నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికీ చెందిన ప్రేమ జీవితం గురించి తెలుసుకోండి. 

Valentine Week: నేడు రోజ్ డే.. ఈ రాశుల వారికి ప్రేమ జీవితం అద్భుతం.. ఆ క్రేజీ లవర్స్ ఎవరంటే..
valentine-week-love-horoscope
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2023 | 11:38 AM

వాలెంటైన్ వీక్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రతి రోజూను సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే వాలెంటైన్ వీక్ అంటారు.ఈ వారం ప్రతి ఒక్కరూ తమ ప్రేమ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మేషం, కుంభం, మీనం వంటి అన్ని రాశుల వారికీ ఈ వారం చాలా ప్రత్యేకమైంది.  కొన్ని రాశుల వారు తమ భాగస్వామిని తల్లిదండ్రులకు పరిచయం చేయాలని ఆలోచించ వచ్చు. ప్రేమని పెళ్లి వరకూ తీసుకుని వెళ్లాలని భావించవచ్చు. ఈ నేపథ్యంలో మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికీ చెందిన ప్రేమ జీవితం గురించి తెలుసుకోండి.

  1. మేష రాశి: ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవలు రావచ్చు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  మాట్లాడే సమయంలో నియంత్రణ ముఖ్యం. వివాదాలు త్వరగా ముగిసే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు తమ భాగస్వామిని కనుగొనవచ్చు.
  2. వృషభ రాశి:  ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా కొత్త సంబంధాన్ని ప్రారంభించండి. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి.
  3. మిధునరాశి: ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ సంబంధం మరింత బలపడుతుంది. రిలేషన్ షిప్ లో ఉన్న వారి ప్రేమ జీవితంలో రొమాన్స్ పెరుగుతుంది.
  4. కర్కట రాశి: ఈరోజు  భాగస్వామితో ఇష్టంగా గడుపుతారు. ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రోజు.. ఈ రాశివారు తమ పనుల్లో బిజీగా గడుపుతారు. దీంతో తమ జీవిత భాగస్వామితో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించలేరు. అయితే మీరిద్దరూ ఒకరి పరిస్థితి మరొకరు అర్థం చేసుకుంటారు.
  7. కన్య రాశి: ఈ రోజు ఈ రాశివారు తమ భాగస్వామిని అన్ని విధాలుగా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రేమికుల మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చి.. ఇద్దరి మధ్య గొడవకు దారి తీస్తుంది. కనుక పెళ్లి ప్రస్తావనకు దూరంగా ఉండండి.
  8. తులరాశి: ఈ రోజు ఈ రాశివారు తమ భాగస్వామి తన సమస్యలను పంచుకుంటారు. అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు.  అయితే  త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
  9. వృశ్చిక రాశి: ఒంటరిగా ఉన్న వారికి ఈరోజు వారి భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితాంతం మీతో సంతోషముగా గడిపే భాగస్వామిని పొందే అవకాశం ఉంది.
  10. ధనుస్సు రాశి: ఈ రోజు మీ భాగస్వామి మీ ప్రేమ బంధం గురించి అలోచించి..  ఒక అడుగు ముందుకు వేయమని అడగవచ్చు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంది.
  11. మకరరాశి: ఈ రాశివారు ఈ రోజు తమ భాగస్వామితో సమయం గడుపుతారు. వీరి ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది.
  12. కుంభ రాశి: ఈ రాశివారు కొత్త ప్రేమ సంబంధాన్ని ప్రారంభించడానికి మంచి రోజు. మరోవైపు, ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ఈ రోజు తమ ప్రేమని వ్యక్తం చేయడానికి ఆసక్తిని చూపిస్తారు.
  13. మీనరాశి: ఈ రోజు ఈ రాశివారు తమ ప్రేమ భాగస్వామిని తమ తల్లిదండ్రులకు పరిచయం చేయడం గురించి ఆలోచించే అవకాశం ఉంది. దీంతో ఇరువురి మధ్య ఉన్న ప్రేమ బంధం  మరింత బలపడుతుంది. పెళ్ళి చేసుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)