Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశులవారికి రాజకీయ యోగం.. అందులో మీ రాశి ఉందా.?

ఈ ఏడాది, వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాశులకు, గ్రహాలకు, గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యం పెరిగింది. వ్యక్తిగత జాతకాల..

Zodiac Signs: ఈ 4 రాశులవారికి రాజకీయ యోగం.. అందులో మీ రాశి ఉందా.?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Feb 07, 2023 | 8:36 AM

ఈ ఏడాది, వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాశులకు, గ్రహాలకు, గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యం పెరిగింది. వ్యక్తిగత జాతకాల సంగతి అటుంచి, గృహ సంచారం ప్రకారం ఏ రాశుల వారు, ఏ నక్షత్రాల వారు విజయాలు సాధించబోతున్నారు అనేది ఆసక్తికర విషయంగా మారింది. రాజకీయంగా పురోగతి చెందటానికి సంబంధించి శని, రవి, శుక్ర గ్రహాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. శని గ్రహం ప్రజలకు, రవి గ్రహం అధికారానికి, శుక్ర గ్రహం రాజకీయాలకు కారకులు. సాధారణంగా మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు రాజకీయాలకు కారణం అవుతుంటాయి. ఈ రాశులు ఎటువంటి దోషాలూ లేకుండా ఉన్న పక్షంలో ఈ రాశులకు చెందిన వారు తప్పకుండా రాజకీయాల్లో రాణించడం జరుగుతుంది.

ఈ ఏడాది శని గురు గ్రహాలు చాలా బలంగా ఉన్నందువల్ల రాజకీయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పాత వారి కంటే కొత్త నాయకులు రంగంలో ప్రవేశించే సూచనలు ఉన్నాయి. శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల యువత ఎక్కువగా రాజకీయాలలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎన్నికలలో ఏ ఏ రాశుల వారు విజయాలు సాధించేది పరిశీలించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నక్షత్రాల విషయానికొస్తే భరణి, పునర్వసు పుబ్బ, ఉత్తర, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, శతభిషం నక్షత్రాలు వారు తప్పకుండా విజయాలు సాధించి రాజకీయ రంగంలో స్థిరపడే అవకాశం ఉంది.

మేషం

ఈ రాశి వారికి శని, గురు గ్రహాలతో పాటు శుక్రుడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల మంచి దూకుడుగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయి. సాధారణంగా, ప్రజా ప్రతినిధిగా విజయం సాధించటంతో పాటు మంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా ఉంది. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకుని అవకాశం కూడా ఉంది. ఈ రాశిలో జాతకులు భరణి నక్షత్రానికి సంబంధించిన వారు అయితే రాజకీయ రంగంలో లేదా ఎన్నికలలో విజయం ఖాయమనే చెప్పవచ్చు.

కర్కాటకం

ఈ రాశి వారికి శని, గురువులతో పాటు కుజ రవి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల, ఎన్నికలలో ఘనవిజయం సాధించే సూచనలు ఉన్నాయి. ఇందులోనూ పునర్వసు నక్షత్రం వారు ఎన్నికలలో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధిగా విజయం సాధించటంతో పాటు మంచి పదవిని అధిష్టించే అవకాశం కూడా ఉంది. రాజకీయంగా వీరు సంపాదన పెరిగి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. వీరికి ఈ ఏడాది మాత్రమే కాక, వచ్చే ఏడాది కూడా రాజకీయపరంగా అదృష్ట యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు.

తుల

ఈ రాశి వారికి ఈ ఏడాది రాజకీయపరంగా విపరీత రాజయోగం పట్టబోతోంది. ఐదవ స్థానంలో ఉన్న శని, ఏడవ స్థానంలోకి మారబోతున్న గురువు వీరిని రాజకీయంగా అందలాలు ఎక్కించడం జరుగుతుంది. పదవులు చేపట్టే అవకాశం కూడా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీరిలోని పాలనా దక్షతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ రాశి వారు అపర కుబేరులు అయ్యే సూచనలు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు.

మకరం

ఈ రాశి వారు ప్రజాసేవ కార్యక్రమాల్లో ఇప్పటికే తెచ్చుకున్న గుర్తింపు ఈ ఏడాది రాజకీయాలలో ఒక మంచి మెట్టుగా ఉపయోగపడుతుంది. శని, గురు గ్రహాలు అన్ని విధాలుగాను అనుకూలంగా ఉన్నాయి. కుంభ రాశిలో ఉన్న శని కారణంగా వీరి జనాకర్షణ పెరుగుతుంది. వీరి మాటకు విలువ ఏర్పడుతుంది. అందువల్ల వీరు ఈ ఏడాది ఎన్నికలలో విజయం సాధించడం తప్పకుండా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ పెద్ద పదవులను చేపట్టే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవలసి ఉంటుంది. ఇందులో ఉత్తరాషాడ నక్షత్రం వారు మంచి రాజయోగం అనుభవించడానికి అవకాశం ఉంది.

ఇక మిగిలిన రాశుల విషయానికి వస్తే ధను రాశి వారికి రాజకీయ ప్రవేశం గానీ ఎన్నికలలో పోటీ చేయడం గానీ జరుగుతుంది. రాజకీయ రంగంలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.