Horoscope Today: ఈ రాశివారికి ఆదాయంలో నిలకడ, వ్యాపారాల్లో లాభాలు.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఆదాయ పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో సంపాదన, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. .

Horoscope Today: ఈ రాశివారికి ఆదాయంలో నిలకడ, వ్యాపారాల్లో లాభాలు.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Feb 07, 2023 | 6:33 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రమోషన్ కు గానీ, ఇంక్రిమెంట్ కు గానీ అవకాశం ఉంది. ఆదాయంలో కూడా మంచి పెరుగుదల కనిపిస్తోంది. ఒకటి రెండు కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకొనే సూచనలు ఉన్నాయి. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. ముఖ్యమైన పనులకు స్నేహితులు సహాయపడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయ పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో సంపాదన, వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు సహాయంతో ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మితిమీరిన ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. విశ్రాంతి తీసుకోవడం కష్టం అవుతుంది. పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు. విద్యార్థులు ఎంతో కష్టం మీద విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఒక విదేశీ కంపెనీ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి తగాదా ఒకటి కొంచెం ఇబ్బంది పెడుతుంది. తోబుట్టువుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థికపరంగా ఇంటి పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఐటీ రంగం వారు అభివృద్ధిలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేసి అందుతుంది. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

నీ మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వెళతారు. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో కొద్దిగా చికాకులు, అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వేరే ఉద్యోగానికి మారాలన్న నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారులు లాభాల పంట పండిస్తారు. ఐటీ నిపుణులకు ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో అనుకోని విధంగా సహచరుల నుంచి ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. వ్యవహార శైలిని మార్చుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాల పరిస్థితి ఆశించిన స్థాయిలోనే ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు నిలకడగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలపడు తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. వ్యాపారంలోనూ, వృత్తులలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కొత్త ఆలోచనలకు చక్కని ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తులు సజావుగా సాగిపోతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు దూరప్రాంతం నుంచి ఒకటి రెండు ఆఫర్లు వస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొద్దిగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఉంటారు. స్నేహితులతో ఆచితూచి మాట్లాడడం మంచిది. ఉద్యోగ పరంగా మేలు జరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. వాగ్దానాలు చేయడం హామీలు ఇవ్వడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

మంచి పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. స్నేహితులకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు