Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun-Mars Conjunction: మరో ఆరు రోజుల్లో ఈ రాశులవారికి అనూహ్య ధనలాభం..! ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి..

జ్యోతిష్య శాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం రెండు స్నేహపూర్వక గ్రహాలు ఒకదానికొకటి తొమ్మిదవ, ఐదవ స్థానంలో కూర్చుంటే.. అది చాలా పవిత్రమైన సంచారంగా..

Sun-Mars Conjunction:  మరో ఆరు రోజుల్లో ఈ రాశులవారికి అనూహ్య ధనలాభం..! ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి..
Sun Mars Navpancham Yog
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 07, 2023 | 12:29 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికను గ్రహ యుతి లేదా గ్రహ సంయోగం అంటారు. అయితే ఈ గ్రహాల కలయిక కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం రెండు స్నేహపూర్వక గ్రహాలు ఒకదానికొకటి తొమ్మిదవ, ఐదవ స్థానంలో కూర్చుంటే.. అది చాలా పవిత్రమైన సంచారంగా భావిస్తారు. ఆ క్రమంలో ప్రస్తుతం సూర్యుడు, కుజుడు త్రికోణ స్థితిలో ఉండటం వల్ల నవపంచం యోగం ఏర్పడబోతుంది. ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో, కుజుడు వృషభరాశిలో కూర్చున్నాడు. మరి ఈ నేపథ్యంలో నవపంచం యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నవపంచం యోగం ఏయే రాశులవారు లాభపడతారంటే.. 

ఇవి కూడా చదవండి
  1. మేషరాశి: నవపంచం యోగం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశిచక్రంలో కుజుడు రెండవ స్థానంలో,  సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు. దీంతో ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులుకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జాబ్ చేసే వారు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
  2. వృషభం:ఇది వృషభరాశికి అనుకూలంగా ఉంటుంది. మీ రాశిలో కుజుడు బలమైన స్థానంలోనూ, సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. జాబ్ నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  3. కర్కాటక రాశి: కర్కాటక వారికి ఈ యోగం ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశిలో కుజుడు శుభస్థానంలో కూర్చొని కేంద్ర త్రిభుజం రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారులు భారీగా డబ్బు సంపాదిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే.. మీరు విజయాన్ని సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి..