AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentines Day: మీరు లవ్ చేస్తున్నవారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ తప్పక పాటించండి..!

మరి కొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. ఈ కారణంగా తాము ప్రేమిస్తున్నవారికి ప్రపోజ్ చేయడానికి అనేకమంది ప్రేమికులు సిద్ధమవుతున్నారు. నిజానికి ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ వాలెంటెన్స్..

Valentines Day: మీరు లవ్ చేస్తున్నవారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ తప్పక పాటించండి..!
Valentine's Day Proposal Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 07, 2023 | 7:41 AM

Share

మరి కొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. ఈ కారణంగా తాము ప్రేమిస్తున్నవారికి ప్రపోజ్ చేయడానికి అనేకమంది ప్రేమికులు సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ రోజు(ఫిబ్రవరి 7) నుంచి ఈ వాలెంటెన్స్ వీక్ మొదలవుతుంది. రోజ్ డే అంటూ ప్రపోజ్ డే అంటూ ఇలా రకరకాల రోజులను కూడా చేసుకుంటూ ఉంటారు యువతీయువకులు. అయితే ఎవరినైనా ప్రేమిస్తున్నా సరే వారి ముందు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడుతూ ఉంటారు ఈ ప్రేమికులు. ఎలాంటి భయం లేకుండా అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే లవ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న ఈ టిప్స్ పాటిస్తే మీకు కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. మరి వారు సూచిస్తున్న ప్రపోజల్ టిప్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా అమ్మాయికి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం కంటే నేరుగా ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకెళ్లి ప్రపోజ్ చేయడం మేలు అని అంటున్నారు. ‘నాది టైంపాస్ లవ్ కాదని, పెళ్లి చేసుకుని జీవితాంతం నడుస్తాన’ని మీరు ప్రేమించే అమ్మాయికి లేదా అబ్బాయికి ఎంగేజ్మెంట్ రింగ్‌తో ప్రొపోజ్ చేస్తే ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే ప్రపోజ్ చేసే ప్లేస్ కూడా గజిబిజి గందరగోళంగా ఉండకుండా కాస్త రొమాంటిక్‌గా, ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటే మేలని అంటున్నారు. లక్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రపోజ్ చేయడానికి మంచి సమయం కూడా ఎంచుకోవాలి. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేసిన తర్వాత వారు ఆలోచించుకోవడం కోసం కాస్త సమయం వెచ్చించాల్సి ఉంటుంది. వారు హడావుడిలో ఉన్నప్పుడు మీరు ప్రపోజ్ చేస్తే మొఖాన తిట్టేసి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వారు ప్రశాంతంగా ఆలోచించే సమయంలోనే ప్రపోజ్ చేయడం మంచిదని అంటున్నారు సీనియర్ ప్రేమికులు.

అలాగే మీరు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు డ్రెస్ కూడా బాగుండాలని ఎలా పడితే అలా వెళ్లి ప్రపోజ్ చేస్తే వారు ఒప్పుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. పెళ్లి తర్వాత ఎలా మసలుకోవాలి, వారి తల్లిదండ్రుల విషయంలో మీ ఉద్దేశం ఏమిటి..? లాంటి విషయాలను కూడా అవతల వారికి చెప్పి వారిని మెప్పించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఎందుకు ప్రేమిస్తున్నారు అని అవతలవారు అడిగితే మీరు అందంగా ఉంటారు కాబట్టి అని చెప్పకుండా వారిలో నిజంగా మీకు నచ్చిన ఏదైనా ఇతర విషయాలను చెప్పాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అందంగా ఉన్నారని లవ్ చేస్తున్నానని చెబితే అందానికి వాల్యూ ఇస్తున్నారని వారు పొరబడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్‌ని మీ వెంట తోడు తీసుకువెళ్లడం మంచిది. దూరం నుంచి ఫోటోలు తీయించి వారు ఒప్పుకుంటే వారికి తర్వాత ఇది ఒక మెమరీలా ఉండేలా ప్రజెంట్ చేయవచ్చు, వారు ఒప్పుకోకపోయినా అది లేదా మీ వరకు ఒక మెమరీలా ఉండే అవకాశం ఉంటుంది.  అలాగే ఆమె ఏం అడిగినా అప్పటికప్పుడు ఆలోచించి చెప్పగలిగే విషయాలైతే చెప్పండి లేదా కొంత సమయం కావాలని కోరండి. అలాగే వీలైనంతవరకు ఆమెతో లేదా అతనితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. లేదంటే వారు మీ నిజాయితీని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. అలాగే పాస్ట్ లో మీకు ఏదైనా లవ్ స్టోరీస్ ఉన్నా అప్పటికప్పుడు చెప్పకుండా కాస్త సమయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు లవ్ ఎక్స్ పర్ట్స్.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..