AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Problems: గ్యాస్, కడుపు ఉబ్బడం ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలివే.. తీసుకుంటే సమస్యలు రెట్టింపు కావడం ఖాయం..!

జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బడం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే తినే ఆహారంలోని

Gas Problems: గ్యాస్, కడుపు ఉబ్బడం ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలివే.. తీసుకుంటే సమస్యలు రెట్టింపు కావడం ఖాయం..!
Diet Tips For Gastric Patients
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 06, 2023 | 3:26 PM

Share

నిత్య జీవితంలో మనం పాటించే ఆహారపు అలవాట్ల కారణంగా కడుపు ఉబ్బడం, గ్యాస్ సమస్యలు వెంటాడడం సాధారణం. ఈ సమస్యల కారణంగా జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థలను తినడం వల్ల జీర్ణక్రియతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బడం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే తినే ఆహారంలోని కొన్ని రకాల పోషకాల వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మరి గ్యాస్ట్రీక్ వంటి కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి పదార్ధాలకు దూరంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గ్యాస్, కడుపు ఉబ్బరం ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలివే..

పాల ఉత్పత్తులు: పాలతో తయారయ్యే వస్తువులు కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. కడుపు ఉబ్బడం లేదా బ్లోటింగ్ సమస్యలున్నవారు పాల ఉత్తత్తులకు దూరంగా ఉండాల్సిందే. పాల ఉత్పత్తుల్లో ఉండే ల్యాక్టోజ్ ఇంటోలరెంట్ అనే పదార్థాన్ని జీర్ణించుకోవడం మన జీర్ణవ్యవస్థకు సాధ్యం కాదు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పాల ఉత్పత్తులు తినకూడదు.

బ్రోకలీ: చాలా రుచిగా ఉండే బ్రోకలీలో పలు పోషక పదార్ధాలుంటాయి. అందువల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి బ్రోకలీ తీవ్ర నష్టం కల్గిస్తుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు బ్రోకలీకి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి: వెల్లుల్లి జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరం. కానీ గ్యాస్ సమస్యను పెంచుతుంది. అందుకే కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లిలో ఉండే ఫ్రుక్టోన్ కడుపులో గ్యాస్ సమస్యను పెంచుతుంది.

బీన్స్: బీన్స్  జీర్ణమవడం కష్టమే. ఇందులో ఉండే పోషక పదార్ధాలు జీర్ణమయ్యేందుకు కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కడుపు ఉబ్బరం వంటి సమస్యలున్నప్పుడు బీన్స్‌కు దూరంగా ఉండాలి. బీన్స్ తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.

ఉల్లిపాయలు: ఉల్లిపాయలు లేకుండా ఏ ఆహారం తయారు కాదు. దాదాపు అన్ని కూరల్లో ఉల్లిపాయ వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. ఉల్లి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో చాలా పోషక పదార్ధాలుంటాయి. ఉల్లిపాయలో ఉండే లిక్విఫైడ్ ఫైబర్ మాత్రం కడుపులో స్వెల్లింగ్ సమస్యను పెంచుతుంది.

యాపిల్: యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే ఏ విధమైన రోగం దరిచేరదని వైద్యులు చెబుతుంటారు. చాలా వ్యాధులకు యాపిల్ మంచి పరిష్కారమౌతుంది. కానీ జీర్ణక్రియకు యాపిల్ మంచిది కాదు. బ్లోటింగ్ సమస్య ఉంటే యాపిల్‌కు దూరంగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..