WhatsApp Secret Features: వాట్సాప్‌లో ఇన్ని సీక్రెట్ ఫీచర్స్ ఉన్నాయా..? తెలిస్తే ఆశ్చర్యపోవాలసిందే..

అధునిక ప్రపంచంలో ఇంటర్‌నెట్ అనేది మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో దాని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే..

WhatsApp Secret Features: వాట్సాప్‌లో ఇన్ని సీక్రెట్ ఫీచర్స్ ఉన్నాయా..? తెలిస్తే ఆశ్చర్యపోవాలసిందే..
Wha App Secret Features
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 06, 2023 | 12:58 PM

అధునిక ప్రపంచంలో ఇంటర్‌నెట్ అనేది మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో దాని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో వాట్సాప్ కూడా ప్రథమ శ్రేణిలో ఉంది. అందుకు కారణం దీనిలోని ఫీచర్లే అని చెప్పుకోవాలి. అయితే ఈ వాట్సాప్​లో మనకు తెలియని కొన్ని ట్రిక్స్, సిక్రెట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. మరి అవేమిటో.. వాటిని ఎలా ఉపయోగించాలో మనం ఇక్కడ తెలుసుకుందాం..

గ్రూప్​లలోని మెసేజ్​లకు ప్రైవేట్​ రిప్లై: కొన్ని కొన్ని సందర్భాలలో వాట్సాప్ గ్రూప్​లో ఎవరైనా మెసేజ్​ పెడితే వారికి పర్సనల్​గా రిప్లై ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఆ వ్యక్తి పెట్టిన మెసేజ్​ మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిప్లై ప్రైవేట్​లీ అనే ఆప్షన్ వస్తుంది. దాంతో మీరు రిప్లైను అనుకున్న ఒక వ్యక్తికే పెట్టవచ్చు. ఇలా మనం వాట్సాప్​ గ్రూప్​లో అందరికి కనిపించేలా రిప్లై ఇవ్వొద్దు అనుకున్నప్పుడు.. పర్సనల్​గా చాట్ చేయవచ్చు.

చాలా సులభంగా వాయిస్ మెసెజెస్: మనలోని చాలా మంది చాట్​ చేయలేనప్పుడు వాయిస్ మెసేజెస్​ పంపుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. మైక్​ మీద హోల్డ్ చేసి వాయిస్ రికార్డు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సరిగ్గా పంపలేం. అలాంటప్పుడు మనం పంపాలనుకున్న వాయిస్ మధ్యలోనే ఆగిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి వాట్సాప్​లో ఒక ఆప్షన్ ఉంది. మైక్​ ఐకాన్​ను హోల్డ్ చేసి పైకి స్వైప్​ చేస్తే మనం బటన్​ను పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సినంత సేపు వాయిస్​ రికార్డు చేసుకోవచ్చు. మధ్యలో రికార్డింగ్​ను ఆపి వాయిస్​ ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. మనం రికార్డు చేసిన దానిని డిలీట్​ కూడా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

కావాల్సిన టెక్ట్స్​ హైలేట్ చేయడం: మనం ఏదైనా మెసేజ్​ను పంపుతున్నప్పుడు దానిలో కొన్ని ముఖ్యమైన పదాలుంటాయి. వాటిని హైలెట్ చేయాలనుకుంటాం. అలాంటి వాటి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్​ తీసుకొచ్చింది. అవేమిటంటే..

  • పదం లేదా వాక్యానికి రెండు చివరలలో స్టార్(*) పెడితే అది బోల్డ్ అయ్యి హైలెట్‌గా కనిపిస్తుంది.
  • పదాలను ఇటాలిక్​గా పెట్టాలనుకుంటే వాక్యాల చివరన అండర్​స్కోర్ (_) పెడితే చాలు.
  • అలాగే టెక్ట్స్​ను స్ట్రైక్‌త్రూ చేయాలనుకుంటే ఇరువైపులా టిల్డెస్ (~) ను పెడితే కోరుకున్నట్లుగా కనిపిస్తుంది.

చాట్​ అన్​రీడ్​​​: మనం చాలా సందర్భాలలో మెసేజ్​లను చూసి బిజీగా ఉండటం వల్ల రిప్లై ఇవ్వడం మర్చిపోతుంటాం. రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఎదుటి వారు బాధపడే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాట్​ను అన్​రీడ్ చేయాలి. మరి అలా చేయాలంటే ఎలా అనుకుంటున్నారా..? మనం చాట్​ చదివినట్లు వారికి తెలియొద్దు అనుకుంటే టెక్ట్స్​ను హోల్డ్​డౌన్​ చేస్తే కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే అన్​రీడ్ చాట్​ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే అవతలి వ్యక్తికి మనం ఇంకా చాట్​​ చదవనట్లు చూపిస్తుంది.

అన్ని చాట్​లు క్లియర్: మన ఫోన్​లో స్టోరేజ్​ను మించి చాటింగ్ ఉంటుంది. దీంతో ఫోన్ స్లో అయ్యే ప్రమాదం ఉంది. అందుకు కొన్నిసార్లు చాటింగ్​ను క్లియర్ చేయాలనుకుంటాం. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్​ క్లియర్ చేయడం చాలా ఈజీ. క్లియర్ ఆల్ చాట్స్ అంటే మొత్తం కంటెంట్ పోతుంది.

మెసెజ్ టైమింగ్స్: మనం ఇతరులకు మెసేజ్ పెట్టి ఎంత సమయం అయ్యింది.. ఎదుటివారు మెసేజ్​ను ఎప్పుడు రిసీవ్​ చేసుకున్నారు.. ఎప్పుడు చదివారు అనే సమయం అంతా చూపిస్తుంది. ఎలా అంటే మనం పెట్టిన ఏదైనా మెసేజ్​ను హోల్డ్ చేస్తే కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ ఇన్​ఫో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద నొక్కితే మెసేజ్ టైమింగ్స్ అంతా కనిపిస్తుంది.

వాయిస్​ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని పెంచవచ్చు: ఏదైనా వాయిస్ మెసేజ్ పెద్దగా ఉంది. దానిని వినడానికి చాలా సమయం పడుతుంది అనుకున్నప్పుడు వాయిస్ మెసేజ్ స్పీడ్​ను పెంచవచ్చు. ఎలా అంటే వాయిస్ మెసేజ్​ ప్లే అవుతున్నప్పుడు ప్లే సింబల్​కు ఎడమవైపున 1x స్పీడ్ కనిపిస్తుంది. దాని మీద మళ్లీ క్లిక్ చేస్తే 1.5x కనిపిస్తుంది. ఇలా మనకు కావాల్సిన వేగంలో వాయిస్ మెసేజ్​ను వినవచ్చు.

ఇలా వాట్సాప్ రకరకాల కొత్త ఫీచర్లను తీసుకొచ్చి యూజర్లను ఆకట్టుకుంటూ..వినియోగదారులకు యాప్ వాడకాన్ని మరింత సులభతరం చేస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..